Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీలో అందరూ ఒకేచోట కలుసుకునే ముఖ్యమైన అడ్డా క్యాంపస్. అటువంటి చోట నలుగురితో కలివిడిగా ఉంటూ స్వేచ్ఛను పంచుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి.. వారి అలవాట్లకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలి? అనే విషయాలు కాలేజీ క్యాంపస్ నుంచే తెలుస్తాయి. నలుగురితో కలిసికట్టుగా లేకుండా ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తే మనకు లభించాల్సిన లోకజ్ఞానాన్ని కోల్పోతాం.
- కాలేజీలో చదువుకునే సమయంలోనే జీవిత లక్ష్యాలు, ఆశయాల గురించి ఒక దృఢమైన నిర్ణయాన్ని ఏర్పర్చుకోవాలి.
- క్లాసులకే మాత్రమే కాదు... ఆ కాలేజీలో నిర్వహించే సోషల్ యాక్టివిటీస్, క్రీడా పోటీలు, ఇతర కార్యక్రమాలలోనూ పాల్గొనడం కూడా ముఖ్యమే. దీంతో రకరకాల మనుషులను, వారి మనస్తత్వాలను, వారి అలవాట్లను, వారి జీవన విధానాలను తెలుసుకోవచ్చు. .
- ఉద్యోగం సంపాదించడానికి చదువు మాత్రమే సరిపోదు. అన్ని రంగాల్లోనూ కొంతలో కొంతైనా పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. వ్యాసరచన, డిబేట్, ఇంటర్ కాలేజీ పోటీలు, సెమినార్లు వంటి అన్ని విభాగాల్లోనూ పాలు పంచుకోవాలి. ఆల్ రౌండర్‌గా తమలో ఉన్న ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలి.
- సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను అనవసరంగా కాలాన్ని వృథా చేసుకోకుండా అందులో మీకు జ్ఞానాన్ని పొందుపరిచే ఆసక్తికరమైన విషయాలపై దృష్టి పెట్టాలి.
- ఉన్నత జీవన విధానాన్ని పొందుపరుచుకోవాలంటే.. ముందుగా మీలో ఉన్న చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. అంటే... ఇతరులకు అబద్ధాలు చెప్పడం, సరిగ్గా క్లాసులకు హాజరు కాకపోవడం, ఇతరులపై లేనిపోని నిందలు మోపడం, గొడవలు, తగాదాలకు దిగడం వంటి లక్షణాలను ఎప్పటికీ అలవాటు చేసుకోకూడదు.
- కేవలం పరీక్ష సమయాల్లో కాకుండా సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలను చదువుకోవాలి. అప్పుడే పరీక్షల్లో కనీస మార్కులతో పాసవ్వడానికి వీలుగా ఉంటుంది.