Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదో ఒక సందరాÄనే పరిచయమైన వారు మళ్లి కలిస్తే. టక్కున గుర్తుపట్టి మాట్లాడేస్తాం. బాగున్నారా..? అంటూ పలకరిస్తాం. కొందరు అలా కాదు. గుర్తు పట్టినప్పటికీ ఏమీ తెలియనట్టు నటిస్తారు. నేను ఫలానా అని చెప్పినా ముఖం అదోలా పెడతారు. గుర్తుపట్టలేదనేస్తారు. ముఖ్యంగా కొందరు అమ్మాయిలకు ఈ అలవాటు ఉంటుంది. అబ్బాయిల విషయంలో వారిలా వ్యవహరిస్తారు. ఏదో ఒకసారి పరిచయమైనంత మాత్రాన అంత చనువు అవసరమా..? అనుకుంటారేమో.. గుర్తుపట్టనట్టు నటిస్తారు. అయితే... ఇలాంటి వారిని ఈజీగా కనుక్కోవచ్చట. వారి కండ్లను చూసి వాఉ అబద్ధం చెబుతున్నట్టు సులువుగా అర్థమైపోతుందట. బ్రిటన్‌లోని పోర్ట్స్మౌత్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఐ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. తాము గుర్తించిన ముఖాలను చూస్తున్నప్పుడు కండ్లు వివిధ రకాలుగా కదులుతాయని గమనించారు. టెర్రరిస్ట్ సెల్స్, గ్యాంగులు వంటి నేర యంత్రాంగాలకు చెందిన ముఖ్యుల ఉనికిని నిర్ధారించేందుకు ఇది దోహదపడుతున్నా తమకు తెలిసిన వ్యక్తులను గుర్తుపట్టనట్టు నటించే వారి నిజస్వరూపాన్ని బయటపట్టేందుకు ఈ ఐ ట్రాకింగ్ ఉపయోగపడుతుందని పరిశోదకులు అంటున్నారు.
ఈ అధ్యయనంలో భాగంగా వర్శిటీ పరిశోధకులు 59 మంది వ్యక్తుల కంటికదలికలను రికార్డు చేశారు. ప్రత్యేకించి వారికి పరిచయం ఉన్న, పరిచయం లేని 200 మందికి చెందిన డిజిటల్ కలర్ ఫొటోగ్రాఫ్‌లను వారికి చూపిస్తూ వారి కంటి కదలికలను పరిశీలించారు. ఆ ఫోటోలను గుర్తించినప్పుడు అధ్యయనంలో భాగమైన వారు తమకు ఆ వ్యక్తులెవరో తెలియదని అబద్ధం చెప్పారు. కొందు తమకు తెలుసని నిజం చెప్పారు. అపరిచిత వ్యక్తుల ఫొటోలను చూసేటప్పుడు కాకుండా పరిచితుల ముఖాలను చూస్తున్నప్పుడు వ్యక్తుల కంటి కదలికలు మామూలు కంటే విభిన్నంగా కనిపించాయని పరిశోధకులు గుర్తించారు.