Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసక్తికరమైన వ్యక్తుల్లో మన చోటును పదిలం చేసుకోవాలంటే.. ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో అలా మీరు ఇతరులపట్ల వ్యవహరించండి.
- లక్ష్యం పట్ల ఉన్న స్థిరత్వం పైనే గెలుపు రసహ్యం దాగుంటుంది.
- నిజం ఉన్నతమైనది. నిజాయితీతో జీవించడం అంతకన్నా ఉత్తమమైనది.
- నవ్వగలిగినంత వరకూ మనిషి పేదవాడు కానేకాడు.
- నిన్నటి గురించి మదనపడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించ గలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్టే.
- గెలుపు అన్నది ప్రయాణం మాత్రమే. లక్ష్యం కాదు.
- మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం.. మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.
- కాంతిని కోరుకునేవారు చీకట్లను జయించేందుకు సంసిద్ధులై ఉండాలి.
- విద్యను పొందడం సులభమే. వివేకం పొందడం కష్టతర కార్యం.
- ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.
- పని అన్నివేళలా ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ పని చేయకుండా మాత్రం మనం ఆనందాన్ని పొందలేం.