Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటి పరీక్ష చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లాడు సురేష్. తన వంతు కోసం రిసెప్షన్ హాల్లో వెయిట్ చేస్తుండగా కన్సల్టెంట్ డాక్టర్ నేమ్‌ప్లేట్ కంట పడింది. 'డాక్టర్ పద్మావతి' అని రాసి ఉంది.
సురేష్ మనసులో ఏదో అలజడి అయ్యింది. పద్మావతి ఎవరో కాదు.. తన క్లాస్మేట్. ఆమెను చూడ్డానికి తహతహలాడిపోయాడు. తన వంతు రాగానే ఆత్రుతగా లోపలికి వెళ్లాడు. తననుకున్నది నిజమే. పదిహేను ఏండ్ల క్రితం తనతోపాటు చదువుకున్న పద్మావతి తన ఎదురుగా ఉంది. అప్పుడెలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. కంటి పరీక్ష చేస్తున్న క్రమంలో ఉండబట్టలేక అడిగాడు సురేష్ 'మీది కరీంనగర్ కదా...?' 'అవును..' అంది పద్మావతి. 'నువ్వు 1991లో టెన్త్ చేశావు కదా..?' అడిగాడు సురేష్. అవునన్నట్టు తలూపింది పద్మావతి. 'క్లాసులో బాగా అల్లరి చేసేదానివి.. ' గతాన్ని గుర్తుచేస్తూ నవ్వాడు సురేష్. ఆమె కూడా నవ్వింది. ఆ తర్వాత అడిగింది 'మీరెవరో గుర్తుకు రావడం లేదు సార్! నేను టెన్త్‌లో ఉన్నప్పుడు
మీరే సబ్జెక్ట్ చెప్పేవారు?' అంతే... సురేష్‌ని ఐ హాస్పిటల్ నుంచి మెంటల్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది.