Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమలో పడితే.. అంతా అద్భుతమే. ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది. లోక మంతా వింతగా కనిపిస్తుంది. జీవితం విలక్షణంగా మారి పోతుంది. ఏ భావాలు లేని వారికి సైతం భావుకత ఉప్పొంగుతుంది. మనసంతా మధుర కావ్యాలే. రెప్ప వాల్చినా, రెప్ప తెరిచినా కండ్ల ముందు ప్రేయసే కనిపిస్తుంది. అనుక్షణం ఆమె ఆలోచనలే. ప్రేమలో పడేముందు వర్ణం, వర్గం ఏమీ గుర్తురావు. ఒకవేళ గుర్తొ చ్చినా.. అవేమీ అడ్డు కావనిపిస్తుంది. కట్టుబాట్లు.. సంప్రదా యాలు.. ఇవేవీ పట్టవు. తమ చుట్టూ ఎంతో మంది ఉన్నారన్న విషయమే స్ఫురించదు. అందరూ ఉన్నా.. ఏకాంత ప్రపంచంలోనే తాము ఉన్నామనుకుంటారు ప్రేమికులు.
ప్రేమకు అందంతో పనిలేదు. రూపాన్ని చూసి పుట్టే ప్రేమలు కొన్ని రోజుల్లోనే మటుమాయమవుతాయి. మనసును చూసి పుట్టే ప్రేమలు శాశ్వతంగా ఉంటాయి. ప్రేమించడానికి ఒక వ్యక్తి దొరికి నప్పుడు జీవించడానికొక ఆశ కలుగుతుంది. అయితే.. ప్రేమించడం కన్నా ప్రేమించబడటమే ప్రధానం. ప్రేమను కలిగి ఉండటం సులువే. ప్రేమను పొందడం కష్టం. అంటే.. ప్రేమ ప్రయాసతో కూడుకున్నదన్న మాట. ముఖ్యంగా అమ్మాయిల మనసును దోచుకో వాలంటే అబ్బాయిలు కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలంటున్నారు అధ్యయనకారులు. ప్రేమకూ కొన్ని పద్ధతులు ఉంటాయని, వాటిని పాటిస్తేనే సఫలమవుతారని అబ్బాయిలకు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం...
- అమ్మాయి ముందు మంచివాడిగా నటించ కూడదు. చాలా మంచివాడిని అని చెప్పేవారి కన్నా తనలోని చిన్నపాటి తప్పులను నిజాయితీగా ఒప్పుకునేవారికే అమ్మాయిలు మనసిచ్చేస్తున్నారు.
- అందమైన అమ్మాయి కదా! మనల్ని మెచ్చు తుందా అన్న ఆందోళన, అనుమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులోకి రానివ్వకూ డదు. తాను దేవతలా ఉన్నాను కదా అని సల్మాన్‌ఖాన్, శింబు లాంటి వాల్లొచ్చి ఐ లవ్ యూ చెప్పా లని ఏ అమ్మా యీ కోరుకోదు. తాను చదువుకుంటున్న, ఉద్యో గం చేస్తున్న ప్రాంతంలో ఉండేవారినే ఇష్టపడుతుంది. సో.. అవకాశాన్ని వదులు కోవద్దు.
- అందమైన అమ్మాయిని చూసిన వెంటనే ఐ లవ్ యూ చెప్పాలని అని పించొచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు. ఎందుకంటే ప్రేమన్నది సుదూర ప్రయాణం. అదే సమయంలో 'హృదయం'లో మురళిలా ఇష్టాన్ని వ్యక్తం చేయటాన్ని సాగదీయ కూడదు. ఆ అమ్మాయి మననుంచి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తే వెంటనే ప్రేమిస్తున్నానని చెప్పేయాలి.
- మన ప్రేమను అంగీకరిస్తే సరే. లేదంటే ప్రేమించమంటూ బలవంతపెట్టొద్దు. అలా చేస్తే ప్రేమ పుడుతుందో లేదో కానీ, నో చెప్పాక మనం మంచి అబ్బాయిగా ఉంటే వాళ్లకు మనపై ప్రేమ చిగురించే అవకాశాలున్నాయి.
- ఏ అమ్మాయికైనా చిన్నగానో, కాస్త ఎక్కువగానో అహంభావం ఉంటుంది. అదే అహంభావాన్ని మనం కూడా వారి వద్ద ప్రదర్శిస్తే.. వీడెవడో మనల్ని మించిపోయాడే అన్న భావన అమ్మాయిలు మనల్ని ప్రేమించేలా చేస్తుంది.
- తన ప్రేమికుడు బైక్, కారు, ఐఫోన్ లాంటి విలువైన వస్తువులు కలిగి ఉండాలని మంచి అమ్మాయిలు కోరుకోరు. ఒకవేళ అలాంటి భావాలున్న యువతి అయితే మన జీవితంలోకి ఆహ్వానించొద్దు.
- ఇంట్లో నాలుగు గోడల మధ్యే కాక సరదాగా బయట ప్రపంచం చుట్టి రావాలని అమ్మాయి లకు ఉంటుంది. ఆ అవకాశం మనం వారికి కల్పించాలి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు వారి భద్రతపై మనం ఎలాంటి బాధ్యత కనబరుస్తున్నామన్న విష యాల్ని ఒక కంట కనిపెడు తుంటారు. అలాంటివారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు.
- గలగలా మాట్లా డే వారంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కొందరమ్మా యిలు హాస్య చతురతతో కూడిన మాటల్ని ఇష్టపడతారు. ఇం కొందరు సెంటిమెంట్ సంభాష ణల్ని. అంతెందుకు మన సుత్తిని కూడా కొందరు బాగా లైక్ చేస్తారు.
- అమ్మాయిలకు పదేపదే 'నేను నిన్ను ప్రేమి స్తున్నాను' అని చెబుతూ ఉండాలి. రోజుకు వంద సార్త్లెనా పర్వాలేదు. అదే మీ ప్రేమకు టానిక్ లాంటిది.
- ప్రియురాలి వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ మరో అమ్మాయి గురించి పాజిటివ్‌గా మాట్లాడటమో, వారిపై పొగడ్తలు కురిపించటమో చేయకండి. ఆ సమయాన్ని మన ఇష్టసఖిని పొగిడేందుకే కేటాయిస్తే మంచిది.
- చైతన్య