Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తానలా
కదిలిపోతోంది, దారంతా
సీతాకోక చిలుకలు జల్లుతూ!
అక్షరాలు తీయగా
మూల్గుతున్నాయి,
నిన్ను వర్ణించిన
అలసటతో!
చినుకు పాదాలతో
మెత్తగా వచ్చి,
గుండెలోతులో
తడి నింపి వెళ్తావు!
తనువు
నిదురపోయినా,
హృదయం నీకోసం
అడుగులేస్తూనే ఉంటుంది!
పగలే
చీకటిని కప్పుకున్నా
కలలో వచ్చే
వెలుగులాంటి నీకోసం!
మట్టిలోకింకినా
ఆవిరైపోయినా,
నిన్ను కరిగించడానికే
కురుస్తుంటా!
- పుట్టి గిరిధర్,
9491493170