Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవితం సరదాగా గడవాలంటే తోటి విద్యా ర్థుల తోనూ, కుటుంబసభ్యుల తోనూ, బంధు వుల తోనూ, ఇరుగు పొరుగువారితోనూ, ఆఫీసులోని కొలీగ్స్తోనూ అనుబంధాలు పెంచుకోవాలి. వారి అభిమానాన్ని, ఆదరణ నూ పొందాలి. అందుకు తగిన విధంగా ప్రవర్తించాలి.
- అసూయను, అహంభావాన్ని ఆధిక్యతనూ తోటి వారి ముందు ప్రదర్శించకూడదు. బడాయి కబుర్లు చెబుతూ ఫాల్స్ ప్రిస్టేజిని పెంచుకోవద్దు. తామిచ్చిన మాటను నిల బెట్టుకోలేక అవతలవారి ముందు తేలికయి పోయి తలదించుకోకూడదు.
- ఎవరైనా మన సహాయాన్ని ఆశించినప్పుడు దాన్ని మనం చేయలేకపోతే నిజాయితీ గానూ, సున్నితంగానూ ఆ విషయాన్ని అవతల వారికి తెలియ జేయాలి.
- ప్రతివారికీ సమస్యలుంటాయి. ఆఫీసులో, ఇంట్లో, చుట్టు పక్కల వారితో. అయితే ఆ సమ స్యలను ఎవరికి వారే పరిష్కరించు కోవాలి. తమ సమస్యల చికాకులు, విసుగును ఇతరుల మీద ప్రదర్శించకూడదు. మన సమ స్యలను, బాధలను ఎదుటివారికి పంచడం, నిరుత్సాహంగా మాట్లాడటంకంటే నవ్వుతూ, సరదాగా మాట్లాడే వారితో ఎవరైనా చక్కగా కలిసిపోతారు.