Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది కాలాలపాటు స్నేహం పదిలంగా ఉండాలంటే నమ్మకమే కీలకం. స్నేహంలో అవతలివారి భావాలను ఎంతమేరకు పట్టించుకుంటున్నా మన్నదే ముఖ్యం. అప్పుడే చెలిమి శాశ్వతంగా ఉంటుంది.
- స్నేహమంటే సరదాలూ షికార్లే కాదు.. అభిప్రాయాలు, అభిరుచులూ కలవడం కూడా. అంతకు మించి ఒకరికొకరు కష్టంలోనూ సాయపడటం... ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉండటం. ఒకవేళ మీ స్నేహంలో అవి లోపిస్తే కారణమేమిటో ఒక్కసారి పరిశీలించు కోండి. మీలోనే ఏదైనా లోపం ఉందనుకుంటే దాన్ని సరిచేసుకోండి.
- అవతలివారిలో మార్చు కోవాల్సిన అంశాలు ఏవైనా ఉన్నప్పుడు ఫ్రెండ్‌గా మీ వంతు ప్రయత్నించండి.
- స్నేహంలో రహస్యాలు పంచుకోవడం, . మనసు విప్పి మాట్లాడుకోవడం సహజం. ఎవరి మధ్య ఈ చర్చలు సాగాయో అవి అక్కడే ఉండిపోతే బాగుంటుంది. అలాకాకుండా సరదాగైనా కోపంతోనైనా వాటిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం మంచిదికాదు. వాటిని ఏ పరిస్థి తుల్లోనూ మూడో వ్యక్తితో పంచుకోకపో వడమే మంచిది.
- మీ ఆలోచనలు, అభిప్రాయాలను ఎదుటి వారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు.
- అవతలివారి ఇష్టా యిష్టాలనూ గమనించండి... గౌరవించండి.
- వ్యక్తిగత విషయాల్లో చొరబడి చేసే వ్యాఖ్యలూ, హాస్యం అవతలివారిని ఇబ్బంది పెడతాయి. ఒకవేళ అలాంటి తప్పు చేస్తే క్షమించమని అడగడానికి వెనకాడకండి. అప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.