Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమికులుగా మారాలంటే తప్పనిసరిగా ఆలోచనను నాటడం అనే కళ తెలిసి ఉండాలి. అందుకు తొలి అస్త్రం చూపు. అలాగని కళ్లలోకి సూటిగా చూడాల్సిన పని లేదు. నేల చూపులతో కూడా అమ్మాయిని ఆకర్షించవచ్చు!
- ఆమెవి అందమైన కళ్లు. కానీ ఆ చూపులకు అర్థం చెప్పడం కష్టం. ఆ చూపులు ఎలా ఉన్నా వాటిని ప్రేమగా మలుచుకోవడం అబ్బాయి సామర్థ్యానికి నిదర్శనం.
- ఆమె చూపులు మిమ్మల్ని వెంటాడేలా చేసుకోవడమే కాదు, ఆమె ఆలోచనలు మీ గురించి వేటాడేలా చేసుకోవాలి కూడా.
- అమ్మాయి చూపుల్లో అమాయకత్వం అనే కోణాన్ని కూడా చూడగలం. కానీ అబ్బాయిల చూపుల్లో అపార్థాలే కనిపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించడం మంచిది.
- మీరేంటో అమ్మాయి కి అర్థమవ్వాలి. మీలోని అందాలను ఆమె గుర్తించాలి. మీలోని తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగించాలి.
- మీరు ఆమె గురించి ఎంతగా పడిచస్తున్నారో మొదట్లోనే చెప్పేయడం, మీరేంటో వందశాతం ఆమెకు అర్థమయ్యేలా చేసేయడం, వెనువెంటనే ఆమెకు ప్రేమిస్తున్నట్టు చెప్పేసి 'నో' చెప్పించేసుకోవడం... ఇలా చేస్తే చేజేతులారా ప్రేమకథకు క్లైమాక్స్ రాసుకోవడమే! అందుకే... మీరు ఎంపిక చేసుకున్న అమ్మాయి మీకు ఎంత చేరువలో ఉందో తెలుసుకొనే వరకూ మాటల్ని, మనసులోని ఊసుల్ని పొదుపుగా వాడటమే మంచిది.
- స్నేహం లేకుండా నేరుగా ప్రేమపై గురిపెడితే లక్ష్యం తప్పే అవకాశాలే ఎక్కువ. ముందు చేయి కలపండి. తర్వాత మనసు అదే కలుస్తుంది. నిజానికి స్నేహంతో అమ్మాయి మానసిక స్థితి దాదాపు అర్థమైపోవచ్చు.
- అలాగే అమ్మాయిలకూ కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ ప్రియుడు మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాడనడానికి ప్రామాణికం.. అతడు పదే పదే మీకు 'ఐ లవ్ యూ' చెప్పడం కాదు. మీ పట్ల అతడు ఏ మేరకు శ్రద్ధ కనబరుస్తున్నాడో తెలుసుకోవడం ముఖ్యం.
- తన ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లయితే అతను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నట్టే.
- మీకు సంతోషం కలిగించే విషయాలు, వస్తువులను అతడు అకస్మాత్తుగా మీ ముందు ఉంచితే తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం.
- బహుమతులు అందచేయడం, ప్రత్యేక కారణం ఏదీ లేకపోయినప్పటికీ మీకు నచ్చిన కొన్ని విషయాల్లో శ్రద్ధ చూపడం లాంటివి చేస్తే అతనికి మీరంటే ఇష్టమని తెలుసుకోండి. మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ సందర్భంగా అతడు మీ అభిప్రాయాలను గౌరవిస్తే అతడి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే.