Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దైనందిన జీవితంలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ అంశంపై చాలాసార్లు అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినా ప్రతిసారీ దీన్ని అనేక కోణాల్లో విశ్లేషించుకోవడం ఎంతైనా అవసరం. కమ్యూనికేషన్ సూత్రం అందరికీ ఒక్కటే. చిన్నాపెద్దా తేడా లేదు.
సమాచారలోపం ఎవరికైనా శాపంగా మారొచ్చు. పరస్పరంగా కమ్యూనికేషన్ కలిగి ఉంటేనే జీవితాలు సుఖదాయకంగా సాగుతాయి. ముఖ్యంగా యువత ఈ విషయాన్ని ఎన్నటికీ మరువొద్దు.
సమాచారలోపమనేది సమాజంలోని అన్ని వ్యవస్థలనూ అవస్థల పాల్జేస్తుంది. ఎలాంటి బిడియం లేకుండా అభిప్రాయాలను వెల్లడించే పద్ధతి మొదట కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఇదెంతో అవసరం. తామేమి కోరుకుంటున్నామో తల్లిదండ్రులకు నిర్మొహమాటంగా పిల్లలు చెప్పేయాలి. అయితే.. ఆ సమయంలో కుటుంబ వాస్తవ పరిస్థి తులను పరిగణనలో తీసుకోవడం కూడా ముఖ్యం. తల్లిదండ్రులు కూడా పిల్లల అవసరాలను నిండు మనసుతో అర్థం చేసుకోవాలి. ఆ అవసరాలను తాము ఏమాత్రం తీర్చగలమో, ఎంతవరకు వాటిని అందించగలమో అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తేనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. అర్థవంతమైన వాతావరణాన్ని ఆవిష్కరించాలంటే మనసు విప్పి మాట్లాడాలి. ప్రత్యక్షంగా కూర్చుని పరిశుద్ధమైన మనసుతో చర్చించాలి. ఎలాంటి భావావేశాలకు ఎవరూ లోనుకావద్దు. ఎంతబాగా కమ్యూనికేట్ చేయగలిగితే అంతబాగా సంబంధాలు బలపడతాయి. వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తి పరంగానూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం.
ఒక వ్యక్తి సామాజిక స్పృహ అలవర్చుకున్నప్పుడు, అతను ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఈ సమాజంలో ఉన్న పరిస్థితులు సరైనవి కావని భావించినప్పుడు తన ఆలోచన్లకు పదును పెడతాడు. ప్రజలనూ, సమాజాన్నీ కమ్యూనికేట్ చేస్తాడు. ఆ ఆలోచన్లు ఆచరణలో అమలైతే ఒక మార్పునకూ, విప్లవానికీ దారితీయొచ్చు.
కమ్యూనికేషన్ అనేది ఇలాగే ఉండాలని స్థిరీకరించే ఒక సబ్జెక్టు కాదు. ఇట్లే ఉంటుందని ఓ అంచనాకో, అవగాహనకో రాలేం. తమ తమ సృజనాత్మకనుబట్టి, పనిస్తున్న రంగాన్నిబట్టి, పరిస్థితినిబట్టి, విషయాన్నిబట్టి ప్రభావితం చేసే అంశాల్నిబట్టి, ఎవరికివారు ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆలోచించుకొని ఆచరించగలగాలి. తమకు కావాల్సిన కమ్యూనికేషన్‌ని ఎవరికి వారు అలవర్చుకోవాలి.
అదీ ఇదీ అనే కాదు.. సమాజంలోని ప్రతి రంగంలోనూ సమాచారం లోపం జాడ్యం ఉంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరేదైనా వృత్తి కావచ్చు, రాజకీయాలు కావచ్చు. మార్పును కోరుకునే వారు, కొత్త అవకాశాలు అందుకోవాలనుకునే వారు నిర్మొహమాటంగా మనసులో మాటను బయటపెడితేనే మంచిది. లేదంటే అవకాశాలు ఎన్నటికీ రావు. ప్రేమ విషయంలోనూ అంతే. మనకు నచ్చిన వ్యక్తికి ప్రేమ వ్యక్తపర్చడంలో ఎలాంటి దాపరికం ఉండొద్దు. మనసులో ఉన్నది చెప్పకపోతే ప్రేమ వ్యవహారం 'వన్‌సైడ్' గానే ఉండిపోతుంది.
మనసులో మనమేం అనుకుంటున్నామో అవతలి వారికి కచ్చితంగా తెలిజేయాలి. ఆఫీసులో బాస్ తిడుతున్నప్పుడో.. మరొక సమయంలోనో అయితే మనం మనసులో ఏం అనుకుంటున్నామో తెలియనక్కరలేదు. మిగిలిన అన్ని సమయాల్లో మాత్రం మనసులో మనమేం అనుకుంటున్నామో అది తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి తెలియాలి. లేదంటే అభిప్రాయ భేదాలు వస్తాయి.
కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మానవ వికాసానికి అవరోధంగా మారుతుందనే విష యాన్ని మరచి పోవద్దు. భవిష్యత్తు అగాధంలోకి పడేందుకు ఇది ప్రాధాన పాత్ర పోషిస్తుంది. అనవసరమైన భయాలు, అలసత్వం, దూరదృష్టి లేకపోవడం, కాలంతోపాటు వేగంగా పరిగెత్తలే కపోవడం, ముఖ్యంగా విజ్ఞాన లోపం కమ్యూని కషన్ గ్యాప్‌కు కారణాలవుతున్నాయి. దీనిని ఎవరికి వారే గుర్తించి సరిచేసుకోవాలి. మనలో కమ్యూనికేషన్గ్యాప్ ఉందని గ్రహించ గానే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఇందుకు ఇతరుల సలహాలు, సూచనలు స్వీకరించాలి.