Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకు రాలిన మోడు
చిగురించే వసంతంలా
బీడు వారిన నేలను
తడిపే వాన చినుకులా
తనొస్తుంది
తనతో పాటు
అందమైన నవ్వుల్నీ
కలల్ని జ్ఞాపకాల్ని వెంటేసుకోని
తనుండేది కాసేపైనా
నవ్వుల్నీ చిందించి
కలల్ని పంచి
జ్ఞాపకాల్ని మిగిల్ని వెళుతుంది
తనలాగే
తన పేరులాగే
- అల
8143916151