Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదురుచూస్తూనే ఉంటా
నీ చూపుల చివరి అంచులైనా
నా మీద పడకపోతాయా అని!
వింటూనే ఉంటా
నీ పెదవుల్లో చివరిమాటైనా
నా గురించి పలకకపోదా అని!
నడుస్తూనే ఉంటా
నీ అడుగులో చివరి అడుగైనా
నా అడుగులో పడకపోదా అని!
కంటూనే ఉంటా
కలలో కనబడే నీ రూపం
ఎప్పటికైనా ఎదురవకపోదా అని!
రాస్తూనే ఉంటా
నా ప్రతి రాతను చూసైనా
నీ హ దయం కరగకపోదా అని!
కాలాలు దాటిపోయినా
కావ్యాలు నిండిపోయినా
గమనం నీవైపే, గమ్యం నీవే!
- పుట్టి గిరిధర్
9491493170