Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏం చేయాలో అర్థం కావటం లేదు. తినకపోతే చచ్చిపోతావ్ అని ఆకలి బెదిరిస్తున్నా పట్టించుకోకుండా దాన్ని మర్చిపోయిన క్షణం ఇది. అయినా ఏం చేయను మరి..'' నిజంగా ఒక పర్సన్ ప్రేమలో ఉంటే ఇలాంటి టైంలో ఏం అనుకుంటారు.. 'నీతో ఉంటే చాలు' అని తన ప్రేయసిని లేదా ప్రేమికున్ని తల్చుకుంటూ ఉంటారు కదా ? అవును ఒంటరి తనాన్ని జయించడానికి, బాధను మర్చిపోవడానికి, ఆనందాన్ని ఆశ్వాదించడానికి, హర్ట్ చేయడానికి, ఆడుకోవడానికి, కొట్లాడానికి, నవ్వించడానికి, ఊసులు చెప్పడానిక ఒకరు ఉండాలి కదా.. అలాంటి తోడుతో కలిసి కాఫీ తాగేటపుడో... కలిసి ఆఫీస్ మెట్లు దిగేటప్పుడో, ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడో ఆ ఆనందం, అనుభూతే వేరు కదా. చేతిలో చేయ్యేసి నడిస్తే ఆ ఫీలింగే వేరు కదా.. ఇలాంటి టైంలోనే మనసు తేలికై శరీరంలో అనేక రసాయనిక చర్యలు జరిగుతాయని ఎన్నో అధ్యాయనాలు చెప్తున్నాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కలోరడో బైల్డర్, యూనివర్సిటీ ఆప్ హైఫా శాస్త్రవేత్తలు జరిపిన ఆధ్యాయనంలో కూడా ఇదే తేలింది. ఇద్దరు ప్రేమికులు కలిసి ఇలాంటి ఆనంద క్షణాల్లో ఉన్నప్పుడు మెదడులో తరంగాలు సమానంగా జరుగుతాయనీ, బాధ తీవ్రత తగ్గుతుందనీ తేల్చారు. ఇంకా చేతిలో చేయేసి నడవటం వల్ల దూరం అవుతున్న మానవ స్వర్శకు ఉన్న శక్తి సామర్థ్యం పెరుగుతుందనీ, ఇద్దరి భావావేశాలు సమానంగా ఉంటాయని గోల్డ్ స్టీన్ అనే శాస్త్రవేత్త వివరించారు. బాధలో ఉన్నప్పుడు, ఒత్తిడిని తట్టుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి ముందు తమ భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారని గోల్డ్ స్టీన్ బృందం గుర్తించింది.