Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫేస్బుక్, వాట్సాపుల్లో అమ్మాయిలు, అబ్బాయిల జోషే వేరు. వారి తీరే వేరు. అయితే మొత్తం సోషల్ మీడియాలో అబ్బాయిలు ఇష్టపడని రెండు పదాలున్నాయి. అవేంటో తెలుసా.. ? అవి ఎక్కువ అమ్మాయి వాడే పదాలే .. అవి Hmm, k. ఈ రెండు పదాలను అమ్మాయిలు ఎక్కువ వాడుతుంటారు. అబ్బాయిల నుంచి వచ్చే మెసెజ్‌లను ఇగ్నోర్ చేయలేకో లేదా కావాలనే ఇలా వాడతారో తెలీదు కానీ అమ్మాయిలు మాత్రం వీటినే వాడి అబ్బాయిల అంతు చూస్తారు. ఉదాహరణకు అబ్బాయి గుడ్‌మార్నింగ్ అని మెసెజ్ చేస్తే Hmm అని, ఎలా ఉన్నావు అంటే k అని సింపుల్‌గా రిప్లరు ఇస్తుంటారు అమ్మాయిలు. అంతే దీంతో ఈ పదాలు అంటే అబ్బాయిలు తెగ విసుక్కుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని అమ్మాయిల మీద అబ్బాయిలు వేసే సెటైర్లు, పంచ్‌లు మామూలుగా ఉండవు. అమ్మాయిలకు క్వెర్టీ కీ బోర్డు అవసరం లేదనీ, వాళ్ల కీ బోర్డులపై Hmm, k. బటన్లు ఉంటే సరిపోద్ది, అంటూ వాటిపై క్రియేట్ చేసే మేమ్స్ బలే సరదాగా ఉంటాయి.