Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా.. దాన్ని ఫాలో అవ్వాలన్నా యూత్ రంగంలోకి దిగాల్సిందే.. వాళ్లకు వాళ్లు ఏమైనా చేయగలరు. ఏ చదువూ చదవక పోయినా... ఏ ఉద్యోగమూ లేకపోయినా యువతలో ఉండే క్రియేటివిటే వేరు. వాళ్లు తలుచుకుంటే ఆక్స్‌ఫర్డ్‌లో లేని పదాలకు అర్థాలు సృష్టించగలరు. వాళ్ల కోసం వాళ్లు ఏదైనా చేసుకోగలరు . అలాంటి యువత నుంచే వచ్చిందిప్పుడు 'టెక్ట్సింగ్ లాంగ్వేజీ' .. ఫేస్బుక్ , వాట్సాప్‌ల వాడకం పెరగిపోయాక ఈ సాంకేతిక భాష కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ చూసినా ఈ భాషే కనపిస్తుంది. ఈ భాషలో ఏముంటుంది. ఎలా వాడతున్నారో ఓ సారి చూసేద్దాం...
సడెన్‌గా Hi gm అని మీకెప్పుడైనా మెసెజ్ వస్తే జీఎం ఏంటీ జీఎం.. జనరల్ మేనేజర్ హా అనుకునేరు. కాదంటHai Good Morningి అని అర్థం. అవును ఇప్పుడు ఇంగ్లీష్ వాడకం ఇలానే నడుస్తోంది మరి. ప్రస్తుతం యువత మునిగి తేలుతున్న 'సాంకేతిక భాషే ఇది. ఫేస్బుక్, మెసెంజర్లో ఎక్కువ అక్షరాలతో పదాలను రాయటాన్ని ఇప్పుడు యువత దాదాపు మర్చిపోయింది. సరైన స్పెల్లింగ్‌తో మెసెజ్ చేయడం ఎన్నో రోజుల కిందటే అయిపోయింది. ఇలా పొట్టి పొట్టి అక్షరాలతో, షార్ట్కట్స్తో మెసెజులు పంపుకోవటం ఇప్పుడు ఫ్యాషన్. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక స్టయిల్. సాంకేతిక పరిజ్ఞాణం పెరిగే కొద్ది తమకు అనుకూలమైన పదాలను యువత తయారు చేసుకుంటున్నారు. మెసెజ్ సర్విస్లు విపరీతంగా పెరిగాకా, మెసెంజర్లపై యువత ఆసక్తి పెరిగాక ఇలాంటి ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నాయి. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడానికే ఈ భాష వాడుకలో కి వచ్చేసింది. సోషల్ మీడియా ఇప్పుడు అందరి చేతికి అందాకా దీనికి క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల కాలంలో వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడే కుర్రాల్లు ఎక్కువైపోతున్నారు. ఇంగ్లీష్ లో తమ ట్యాలెంట్‌ను అంతటినికి టైమ్‌లైన్‌లో, ఇన్బాక్సుల్లో ఒలకబోస్తున్నారు. దీనికి తోడు ఇంగ్లీష్ కూడా నూతన ఒరవడులు తొక్కుతోంది. ట్రెండ్ కు అనుగుణంగా LOL, DUDE, Selfie, Rulf, లాంటి పద ప్రయోగాలు జరుగుతున్నాయి. చాలా మంది ఫోన్ లో మాట్లాడటం కంటే చాలా సార్లు మెసెజ్ సర్వీస్ నే ఎక్కువగా వాడుతున్నారు. మాట్లాడనవసరం లేకుండా మెసెజ్ లు పంపుకోవడం కుర్రకారుకే కాదు ప్రతీ ఒక్కరికీ అనివార్యంగా మారింది. శుభాకాంక్షలు తెలపాలన్నా, కంపెనీలో బాస్ కు ఇన్ఫ్షర్మేషన్ ఇవ్వాలన్నా ఈ మెసెజ్‌లే దిక్కు. ఈ ఎస్ఎంస్ లు వాడాల్సిందే. బాధలో ఉన్న మిత్రున్ని ఓదార్చాలన్నా, ఆప్తులతో ఆనందాన్ని పంచుకోవాలన్న ఎస్ఎంఎస్ లు అనివార్యంగా మారాయి. అందులోనూ ఈ షార్ట్‌కట్ లాంగ్వేజీకి ఉన్న ఇంపార్టెన్స్ వేరు.
సులువుగా అపరిమిత సందేశా లు పంపుకోవడానికి వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్, హైక్ వంటి చాటింగ్ సోషల్ మీడియా అప్ లు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రతీ పనికి ఫోన్ చేయడం అవసరం లేకుండా ఒక చిన్న ఈ తరహా ఎస్ఎంఎస్ పూర్తి అర్ధవంతమైన సమాచారిన్ని అందింస్తుంది. అయితే ఈ విధమైన ఎస్ఎంఎస్ లను విపరీతంగా వినియోగించటం వల్ల కంప్యూటర్ లాగే మొబైల్ కు కూడా ఒక పరిభాష అనేది యూత్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ చాటింగ్ ల కారణంగానే ఇటు ఇలాంటి భాష పుట్టుకొస్తోంది. hi-hai, hlo-hello, h r u - how are you, hmm- Yes, wt dng- what are you doing, gr8- great, gd n8- good night, gd mg- good morning, tc-take care, ty- Thank You, 5n- Fine ఇలా బోలేడు సంక్షిప్త పదాలు, వాక్యాలు, చాటింగ్ భాషలో పుట్టుకొచ్చాయి. అయితే ఒక్కో సారి తెలుగు, ఇంగ్లీష్ పదాలు కలగాపులగంగా ఉండే పదాలను కూడా మనం చాటింగ్ భాషలో చూడవచ్చు. దీనికి తోడు స్మైలీస్, ఎమోషన్స్, రియాక్షన్స్ అంటూ హావాభావాలు, ముఖకవలికలలాగా కొత్త కొత్త అప్షన్లు సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతుండటంతో చాటింగ్ ప్రియులు మరింత ఆకర్షిస్తులవుతున్నారు. తక్కువ సమయంలో, తక్కువ స్థలంలో సమాచారాన్ని పంపండానికి ఇలా వాడుతున్నారు. ఈ వ్యవహారం సరిగానే ఉన్న ఈ ఛాటింగ్ భాషా మితిమీరితే కష్టమనే చెప్పాలి. అలవాటులో పొరపాటు గా విద్యార్థులు పరీక్షలలో కూడా ఈ భాషను రాసే ప్రమాదం ఉంది. ఉన్న స్పెల్లింగ్ లు మరిచిపోయి ఇలా సంక్షిప్త పదాలు వాడినా ఆశ్యర్యం లేదు. ఈ ఛాటింగ్ భాష ఇంకా ఎన్ని కొంత పుంతలు తొక్కుతుందో జీర్ Jst W8 n c (వేట్ ఆండ్ సీ)