Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఫీస్‌లో బాస్ అయినా, అందమైన అమ్మాయైనా, మీ దగ్గరి వ్యకులైనా మిమ్మల్ని మెచ్చాలంటే కొంచెం వాళ్లకు నచ్చేట్టు ఉండాలి. అందులో ముఖ్యంగా మీ గర్ల్‌ఫ్రెండ్‌కు మీరు నచ్చాలంటే ఎంత జాగ్రత్త పడాలి. లేదా మీకు నచ్చిన అమ్మాయికి మీపై మంచి ఇంప్రెషన్ కలగాలంటే ఏం చేయాలి? అవును మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టపడ్డ అమ్మాయిని ఒప్పించాలన్నా, ఒప్పుకున్న ప్రేమను నిలబెట్టు కోవాలన్నా అబ్బాయిల చేతుల్లోనే ఉంది. అందుకే మెట్టు దిగి వ్యవహరించాలి. ఆమెకు నచ్చేట్టూ ఉండాలి.
టీనేజ్ దాటిన కుర్రాల్ల విషయానికొస్తే అమ్మాయి తారసపడిన ప్పుడు ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని మనసు మారాం చేస్తుంది. చివరకు ఆమె దృష్టిలో పడాలని పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎంత యత్నించినా ఆమె కన్నెత్తయినా చూడకపోతే పాపం మనోడి పరిస్థితి అంతే.. అయినా కసరత్తు అక్కడితో ఆగదు. ఆమెను పరిచయం చేసుకునే ప్రయత్నం అక్కడితో ఆగదు. ఎట్టకేలకు అది ఫలిస్తుంది. దాన్ని మీరు ప్రేమ అనుకోవచ్చు. కానీ.. ఆమె కూడా అదే భావిస్తుందనుకోలేం. ఫ్రెండ్షిప్ అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది.
ఇష్టమైన అమ్మాయితో ఏర్పడే ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడమంటే ఆషా మాషి కాదు. ఆమె మిమ్మల్ని ప్రేమికుడిగా స్వీకరిస్తుందనే గ్యారెంటీ లేదు. ఒక అమ్మాయి ఇష్టపడాలంటే అబ్బాయిలకు బోలేడు అర్హతలుండాలి. వాటిని ఆమె గుర్తిస్తేనే ప్రేమ చిగురించేది.
నిజాయితీ...
అబ్బాయి దగ్గరి నుంచి అమ్మాయి ప్రత్యేకంగా కోరుకునేది నిజాయితి. తనతో సన్నిహితంగా ఉన్న అబ్బాయిలో అది ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఆమె ముందు జెంటిల్మెన్ అనిపించు కోవాలంటే నీతి తప్పొద్దు. విషయమేదైనా సూటిగానే వ్యవహరిం చాలి. తనకో నీతీ, ఇతరులకో నీతి అనుకునే అబ్బాయిలంటే అమ్మాయిలు ఆమడ దూరంగా ఉంటారు. అలాగే అబద్ధాలాడే అబ్బాయిలు అస్సలు నచ్చరు. సాధారణంగా అమ్మాయిలకు పొగడ్తలంటే చాలా ఇష్టం. వారి అందం గురించి ఒక్క మంచిమాట చెప్పినా కొందరు అమ్మాయిలు ఇట్టే మురిసిపోతారు. అలాగని మరీ ఎక్కువగా పొగిడేయకండి.
స్పెషల్‌గా ట్రీట్ చేయండి..
అందరి అమ్మాయలకంటే మీ గర్ల్ ఫ్రెండ్‌ను స్పెషల్‌గా ట్రీట్ చేయండి. అది తనకు తెలిసేలా చేయండి. మీకు అపారమైన తెలివితేటలుంటే అవి ఇతరు దగ్గర కాకుండా మీ గర్ల్‌ఫ్రెండ్‌తోనే పంచుకోండి.తన భాగస్వామి ఇతరులకన్నా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. ఫ్రెండ్స్కన్నా తనకే ఎక్కువ ప్రయార్టీ ఇవ్వాలనుకుంటారు. సిన్మాలు, షికార్లు, పార్టీలు.. అకేషన్ ఏదైనా ఎప్పుడూ తన ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమివ్వాలని అమ్మాయిలు కోరుకుంటారు. అలాని తనకు ఇష్టం లేకుండా బయటకు తీసుకెళ్లడాలు, పార్టీల్లో ఫ్రెండ్స్‌ను పరిచయం చేయడాలు పెట్టుకోవద్దు. అవసరమైతే తన కోసం పనిని రద్దు చేసుకోవటం మంచింది. మీకేమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటే అంత త్వరగా, సందర్భం లేకుండా చెప్పొద్దు. ఒక వేళ చెప్పినా పదే పదే దాని ప్రస్తావన తీసుకురావద్దు. ఆమెకు అర్థం చేయించాలి. ఆమె ముందు మరో అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడినా, పొగిడినా అంతే సంగతి.
పంతాలు, పట్టింపులు వద్దు...
ఇద్దరి మధ్య అప్పుడప్పుడు స్పర్ధలు రావటం సహజం. అప్పుడు పంతాలకు దిగడం సరికాదు. కంప్రమైజ్ సరైన మార్గం. ఏదైనా విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మీదే పైచేయి అన్నట్లు వ్యవహరించకండి. మీరు మాట్లాడటంలో తప్పు ఉండకపోవచ్చు. అయినా మీరే ఒక మెట్టు దిగి సున్నితంగా వ్యవహరించండి. అమ్మాయి తప్పులను ఎత్తి చూపకుండా వారికి అర్థమయ్యే రీతిలో ఆమెను వివరించాలి. వ్యక్తిగతంగా ఇగోకి వెళ్లి ఆమెను హర్ట్ చేయవద్దు. మీరు కంప్రమైజ్ అవుతారో లేదో అని అమె వేచి చూస్తుండవచ్చు.
స్వీట్ నథింగ్స్...
మామూలుగా బారు ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇద్దరూ ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుకుంటారు. అయితే ఏం మాట్లతారు అని ఒక సారి అడిగి చూడండి. ఏమీ చెప్పరు. అసలేం మాట్లాడామో అని వాళ్లే తల గోక్కుంటారు. ఇలా టైంతో పని లేకుండా ముచ్చట్లు పంచు కోవటాన్ని 'స్వీట్ నథింగ్స్' అంటారు. ఇవి ఇద్దరు ప్రేమికుల మధ్య చాలా సహజం. ఒక రకంగా ఈ స్వీట్ నథింగ్స్ లేని ప్రేమే ఉండదు. అదంతా ప్రేమను అంగీకరించిన తర్వాత మరి ప్రేమను అంగీకరిం పజేయాలంటే..? నచ్చిన అమ్మాయితో మాట్లాడేటప్పుడు మంచి భాషను ఉపయోగించాలి. మీ మాటలకు ఆమె ఇప్రెస్ అవ్వాలి. మరీ సోది లేకుండా ల్యాగ్ చేయకుండా ఆహ్లాదంగా మాట్లాడాలి. నవ్విస్తూ ఉండాలి. అంతేకానీ.. ఎక్కడా మర్యాద తప్పొద్దు. వ్యంగ్యంగా మాట్లాడినా, వాళ్లపై సెటైర్లు వేసినా అమ్మాయిలకు నచ్చదు. పైగా మీకు చెడు ఆలోచనలు ఉన్నాయని ఆమె అనుకోవడానికి ఆస్కారం ఉంది. డబుల్ మీనింగులంటే అమ్మాయిలకు మహా చిరాకుగా ఉన్నట్టు ఉంటారు. ఇంప్రెస్ చేయాలనే ఆలోచనతో వల్గర్‌గా మాట్లాడితే ఆమె మిమ్మల్ని అసహ్యించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవారంటే అమ్మాయిలకు అస్సలు ఇష్టముండదు. ఇలాంటి వారితో చనువు పెంచుకోరు. అలాగని సరదా పేరుతో చిల్లర మాటలు మాట్లాడొద్దు. అలాగే ఇద్దరు కలుసుకున్నప్పుడు సరదా కబుర్లు మాట్లాడుకోవాలి కానీ.. ఫ్లాష్బ్యాకులకు తెర తీయొద్దు. అమ్మాయిలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచడం సర్వసాధారణం. అలాగని మీ లవర్ తల్లి దండ్రుల పట్ల ఆమె ఎదుట ద్వేషాన్ని ప్రదర్శించొద్దు. మొత్తానికైతే సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ అమేని ఇంప్రెస్ చేయాలి. సంతోషాలు పంచుకోవాలి. ఒక్క సారి ప్రేమించటం మొదలు పెట్టాక కొందరు అమ్మాయి స్వీట్ నథింగ్స్ చెప్పటం మానేసి బాధలు చెప్పటం ప్రారంభిస్తుంది. సందర్భానికి తగట్టు ప్రతిస్పందించాలి తప్ప కోపగించుకోవద్దు.
- వినోద్ మామిడాల