Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గేటు చప్పుడు!
విన్నప్పుడల్లా
ఎద తలపులు విచ్చుకుంటాయి
శబ్ధం పరాయిదైనప్పుడు
ఎదురు చూపులకు
పగలూ రాత్రీ తేడాలుండవు!
ప్రావాసమెవరికైనా
గోడలు లేని జైలు జీవితమే
పక్షులు రెక్కలొచ్చి
గూళ్ళు వెతుక్కున్నాక
కాల పరీక్షకు నిలబడ్డది
ఇప్పుడు నువ్వూ నేనే
కలిసి సప్త సముద్రాలీదినా
మనకీ దుఃఖం కొత్తదే!
కాలాన్ని నిలదీసే నాకు
నీ ఎడబాటు తాత్కాలికమైనా
జీవనమొకింత చేదూ ఒగరే!
ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మలి దశ నా జీవన ప్రస్థానానికి
ముగింపు వాక్యం నువ్వే!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
9440233261.