Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రెండ్ ఎంత మారినా ఫ్యాషన్‌లో మాత్రం జీన్స్ ట్రెండ్ మారటం లేదు. జీన్స్‌లోనే కొత్త కొత్త వేరియేషన్స్ ఎప్పటికప్పుడూ యువతను ఆకట్టుకుంటున్నాయి. జీన్స్ కలెక్షన్స్ అకేషన్‌కు తగ్గట్టు డిఫరెంట్ స్టైల్స్, కాలేజీకి వెళ్లడానికి కూల్ లుక్, ఆఫీస్‌కు వెళ్లడానికి ప్రొఫెషనల్ లుక్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ యూత్ మెచ్చేట్టు రావటంతో వాటికి మరింత క్రేజ్ పెరుగుతోంది. దీంతో మెన్స్ ఫ్యాషన్‌లో జీన్స్దే జిందగీగా మారుతోంది.
ఒకప్పుడు పార్టీవేర్ అనగానే కుర్తఫైజామా, బ్లాజర్స్ పైనే అబ్బాయిలు ఎక్కువ ఆసక్తి చూపేవారు. కానీ జీన్స్‌లో కూడా పార్టీవేర్లు వచ్చాక యూత్‌కి వీటిపై ఆసక్తి పెరిగింది. పార్టీవేర్ అంటే కొద్దిగా ప్లాష్గా ఉండాలి. కొద్దిగా ఇంట్రస్టింగ్‌గా ఉండాలనే ఆలోచనతో ప్రస్తుతం చెక్స్ జిన్స్ పై అబ్బాయిల స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ట్రెండింగ్‌లో 'ఫోర్వే లైట్ కా డెనిమ్' అందరూ కామన్‌గా జీన్స్ అంటే బ్లూ, బ్లాక్ మాత్రమే ఆలోచిస్తారు కానీ కాలం మారింది. లైట్ టోన్స్, లైట్ ప్యాచ్‌వర్క్, రింకుల్ డెనిమ్, ప్యాచీ, లాటిన్ ట్రెండ్ జీన్స్, నీటేరింగ్, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 'ఫోర్వే లైట్ కా డెనిమ్'ను బాగా ఉపయోగిస్తున్నారు. సెలబ్రేటిస్ ఎక్కువగా లైట్ కా డెనిమ్‌ను వాడుతున్నారు కనుక యూత్ కూడా దీనికే అట్రాక్ట్ అయ్యారు. దీనికి మోకాలి దగ్గర చిన్న కట్ల ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. అందుకే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇది స్టెచెబుల్ కనుక ఎలాంటి వయస్సు వారికైనా, ఎలాంటి సైజు వారికైనా ఫర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి యూత్ ట్రెండ్‌లో ప్రస్తుతం ఈ మోడల్ చెక్కర్లు కొడుతోంది. అమ్మాయిలకైతే చాలా ఆషన్స్ ఉంటాయి. అబ్బాయిలకు ఆప్షన్స్ ఉండవు అనుకునే వారికోసమే ఇప్పుడు కలర్ డెనిమ్ మార్కెట్లోకి దూసుకొచ్చాయి. దీనిలో రకరకాల కలర్స్ కొత్త కాన్సెప్ట్‌తో ప్యాంట్స్ అందుబాటులో కొచ్చాయి. వీటిపై కొంచెం కాస్లీ షార్ట్ వేసుకుంటే ఆ లుక్ ఏ వేరు అంటున్నారు అబ్బాయిలు.
ఒకొక్క ఆకేషన్కి ఒకొక్క స్టైల్ మెన్‌టైన్ చేయాలనే కాన్సెప్ట్‌తోనే యూత్ ముఖ్యంగా ఇలాంటి డిఫరెంట్ మోడల్స్‌ని ఎంచుకుంటోంది.
ప్యాచ్‌లే ఫ్యాషన్...
జీన్స్ ట్రెండ్ ఒకటే కానీ వేరియేషన్స్ వేరు. చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్, స్ట్రెచ్ బూట్ కట్, ఫేర్డ్, బారు ఫ్రెండ్ బ్యాగీ స్కిన్స్ యాంగిల్ కట్ వగైరా వగైరా. ఇలా ఎన్నో రకాల జీన్స్ యూత్‌ని కట్టి పాడేస్తున్నాయి. అమ్మాయిలకైతే డెనిమ్ క్లాత్ తో చేసిన జెగ్గింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. జీన్స్ కి తగట్టు టీ షర్ట్ ,కుర్తీ , కుర్తాలే కాదు. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సి టాప్‌లతో లుక్ వస్తుంది. లోగోలు, నంబర్లు, ఫంకీ బొమ్మలు, చిన్న చిన్న కోట్స్.. ఇలా చాలా రకాల జీన్స్‌ప్యాంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కొందరు ఇలాంటి జీన్స్‌ని కొనుగోలు చేస్తుంటే... మరికొందరు ప్యాచ్‌లు విడిగా కొనుక్కొని టైలర్ దగ్గర జీన్స్ ప్యాంటుపై కుట్టించుకుంటున్నారు.
ఫేడెడ్కి మరింత క్రేజ్..
మామూలుగా కొన్ని జీన్స్ రంగులు వెలిసిపోతాయి. అయినా లుక్ మాత్రం తగ్గదు. అందుకే ఈ మధ్య ఫేడెడ్ జీన్స్, లైట్ కలర్ జీన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి జీన్స్‌ను యువత మరింత ఇష్టపడుతున్నారు. ఏదైనా పార్టీ కి వెళ్లాలనుకుంటే ఫేడెడ్ జీన్స్ పైకి రాయల్ కలర్ షర్ట్ వేస్తే అదిరిపోద్ది అంటున్నారు క్లాథింగ్ ప్రియులు.
జూ జీన్స్
కాలంతోపాటు ఫ్యాషన్ ప్రపంచంలో పెను మార్పులు చోటుచేసుకుంటు న్నాయి. మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌తో జీన్స్ ప్యాంట్లు వస్తున్నాయి. ఇందులో 'జూ జీన్స్' ఒకటి. దీని డిజైన్ ఓ వినూత్న, విలక్షణ ప్రక్రియ. అంతేకాదు.. విచిత్రమైనది కూడా. ఈ జూ జీన్స్‌ని జంతువులు డిజైన్ చేస్తాయి. అదీ జూలోనే. జపాన్‌లో ఈ జీన్స్ ట్రెండ్ సాగుతోంది. దీనిని చాలా వింతగా తయారు చేస్తారు. జీన్స్ ప్యాంట్లు తయారు చేసేందుకు వాడే ముడి వస్త్రాలను పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఉన్న జూలో విసిరేస్తారు. ఫుట్‌బాల్, టైర్లు కట్టి మరీ వాటి మధ్యలో వేస్తారు. ఆ వస్త్రాలను జూలో ఉన్న జంతువులు ఇష్టమొచ్చినట్టు చింపిరి చింపిరిగా మార్చేస్తాయి. దీంతో ఆ వస్త్రాలకు ఓ సరికొత్త రూపం వస్తుంది. తర్వాత వాటితో మళ్లీ జీన్స్ ప్యాంట్లు, మోడల్ జీన్స్ షర్టులు తయారు చేస్తారు. ఈ వస్త్రాలను జూ జీన్స్ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తారు. వీటిని జపాన్ యువత ప్రస్తుతం ఎగబడీ మరీ కొంటోందట. ఇక ఈ వస్త్రాలు తయారు చేసేందుకు జంతువుల సాయం తీసుకున్నందుకు గౌరవంగా పులులు చింపిన డ్రెస్సులకు టీ 1, లయన్స్ చించిన డ్రెస్సులకు ఎల్ 1 బ్రాండ్స్‌తో మార్కెట్లో విడుదల చేస్తున్నారు
- పబ్బు ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్,9963418781