Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వొస్తున్నావంటే చాలు
కాలం కుంటి గుర్రమవుతది
ఎదురు చూస్తున్న కొద్దీ
శిలువొకటి భుజం మ్మీద ఊరేగుతది!
నీవు నాతో ఉన్నప్పుడు ఈ ఇల్లు
నన్నెంతగా ప్రేమిస్తదో... అది వొట్టి నటన!
దుఃఖాన్ని దిగమింగుకోలేక
పుస్తకాలలో తలదాచుకుంటున్నా
తినేది నాల్గు ముద్దలే అయినా
వంటిల్లు పద్మ వ్యూహమై భయపెడ్తది
విధి లేక చేయి కాల్చుకుంటానా
వాతలు నా గత దాష్టీకాన్ని గుర్తు చేస్తాయి
రోజు వంట చేసి ఎదురు చూడటం
ముందస్తు ఎన్నికల నిర్వహణంత హడావుడి!
సహచరీ! నీ ఔన్నత్యం నాకెరుక చేసేందుకేమో
ఈ ఎడబాటుకింత ఉబలాటం!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261