Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతులేని నా ఆవేదనల మీద
కురిసి మెరిసిన పన్నీటి జల్లే
నీ చల్లని చూపు!
ప్రశ్నార్థకమైన జీవితంలోకి
పరకాయ ప్రవేశం చేసి
సమాధానమై నిలిచిన
నీ తీయని పలకరింపు!
పాతాళంలోకి
కూరుకు పోతున్న నన్ను
ఆకాశానికి ఎత్తి
ఆ చుక్కల అంచున
నిలబెట్టిన నీ సౌజన్యం!
తడిలేని హృదయాన్ని
తడిమి చూసి తడి చేసి
తన్మయత్వంలో పులకింప జేసిన నీ ప్రేమ!
ఇవన్నీ దక్కినా
మనసులో ఏదో అసంతృప్తి
బహుశా.. అన్ని జన్మలకూ
దొరికితేనే నాకింక సంతృప్తి!!
-వెన్నెల సత్యం, షాద్నగర్
9440032210