Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐఐటీ కారగ్పూర్ ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవర్నెస్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 13న హైదరాబాద్‌లో లోకల్ స్టార్టప్ మీట్ ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ అసోసియేట్ మెంబర్ ఏఎన్ దినేశ్ చంద్ర మీడియాకు తెలిపారు. ఈ అవర్నెస్ డ్రైవ్‌ను దేశవ్యాప్తంగా 22 నగరాల్లో లోకల్ స్టార్టప్ మీట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సదస్సులో జెన్‌వర్క్ సీఈఓ సంజీవ్ సింగ్, హైదరాబాద్ ఏంజెల్స్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ శ్రీకాంత్, కవర్‌ఫాక్స్ సీఈఓ ప్రేమాన్షుసింగ్, పరంపరా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ మురళి క్రిష్ణ, యప్ టీవీ సీఈఓ ఉదరురెడ్డి, స్టార్టప్బైట్ కో ఫౌండర్ ప్రవీణ్ డోర్న పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో నెట్వర్క్, పిచ్చింగ్, పానెల్ డిస్కషన్ సెషన్లు ఉంటాయని చెప్పారు. ఔత్సాహికులు ఈ సదస్సును ఉపయోగించుకోవాలని కోరారు.https://goo.gl/wsC3bM ఈ లింక్ద్వారా రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.