Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫేస్బుక్ అనగానే ఎక్కడా లేని ఫ్రెండ్ సర్కిల్ అంతా ఇక్కడే ఏర్పడుతుంది. బయట ఎంత మందితో పరిచయం ఉన్నా ఫేస్బుక్లో మాత్రం వందలు, వేల సంఖ్యలో లిస్టు నిండిపోద్ది. అందులో కొందరు మనకు తెలిసిన వారై ఉంటారు. కొందరికి మనం తెలిసిన వారమై ఉంటాం. ఇలా విభిన్న రకాల పరిచయాలతో ఫ్రెండ్స్ లిస్టు పెరిగిపోతుంది. మరి అలాంటి లిస్టులో ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఏ రకమైన కోవకు చెంది ఉంటారో ఇటీవల ఓ సంస్థ సర్వే చేసింది. అలాంటి మైండ్ సెట్‌తోనే ఫేస్బుక్ వాడతారంటా.. మరి అలాంటి వారెవరో చూద్దాం...
- ట్యాగింగ్ మైండ్ అంటే ఏ సంబంధమూ లేని పోస్టులకు, ఫొటోలకు కూడా ఫ్రెండ్స్‌ని ట్యాగ్ చేస్తుంటారు.
- కొందరు తమ స్టేటస్ అప్టేట్లు, కామెంట్లు, ఫొటోలను వారికి వారే లైక్ చేసుకుని సంబరపడుతుంటారు.
-కొందరు కాపీ క్యాట్లు.. అంటే ఇతరుల పోస్టులను కాపీ చేసి సొంత టైం లైన్లో తమదే ఈ పోస్టు అన్నట్టు అప్డేట్ చేస్తారు. కనీసం పోస్ట్ హోల్డర్ నేమ్ మెన్షన్ చేయకుండా పోస్టులను దొంగతనం చేస్తారు...
- కొందరు తాము నమ్మే సిద్దాంతాలను పోస్టు చేస్తుంటారు. ఆపోస్టుల్లోనూ అవే సిద్ధాంతాలతో కామెంట్లు ఇచ్చి నమ్మిన సిద్దాంతాల వ్యాప్తికోసం పని చేస్తారు.
-కొందరు తమకు సంబంధంలేని ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చుతుంటారు.
- కొందరు ఫ్రెండ్స్ ఫేస్బుక్లో గేమ్స్ ఆడటానకే వస్తుంటారు. కొందరు ఆటలాడేందుకే మాత్రమే సైట్‌ను సందర్శిస్తారు.
- కొందరు తరచూ తాము చిత్రీకరించిన ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు.
- కొందరు తరచూ సైట్లోకి రారు. 'నామ్ కే వాస్తే' అన్నట్టు అప్పడప్పుడు వచ్చిపోతుంటారు.
- కొందరు మూఢనమ్మకాలను భలే నమ్మేస్తుంటారు. షేర్ చేయండి పుణ్యం వస్తుందనే పోస్టులను కూడా ఆలోచించకుండా పోస్టులు చేస్తుంటారు. వారి టైంలైన్ చూస్తే అన్నీ అలాంటి పోస్టులే ఉంటాయి.
- కొందరు మీరు పోస్ట్ చేసిన అన్ని అప్డేట్లను లైక్ చేసేస్తుంటారు.
- కొందరు పోస్టులకు సంబంధం లేకుండా రియాక్షన్స్ ఇస్తుంటారు.
- కొందరు తెలియని వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపడమే పనిగా పెట్టుకుంటారు.
- ఇంకొందరు తమ జ్ఞాణాన్ని అంతా ఒలకబోసి డబ్బా కొట్టుకుంటు సంబురపడతారు...