Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎత్తుకు పై ఎత్తు...
ఒక భార్య భర్తకు మెసేజ్ చేసింది.
'వచ్చేప్పుడు వెజిటబుల్స్ తీసుకురండి. అలాగే సుమతి మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది.''
భర్త రిప్లరు: 'ఏ సుమతి?'
భార్య: హ హ.. సుమతి అని ఎవరూ లేరు. మెసేజు చదివారో లేదోని టెస్టు అంతే..
భర్త కొంచెం ఆలోచించి..
భర్త రిప్లరు : నీ మొఖం. నిన్ను అడిగింది పక్క వీధి సుమతా, ఎదురు వీధి సుమతా అని తెలుసుకోవడానికి అని. ఇప్పుడు నాలుగో వీధి సుమతి నేనూ వెజిటబుల్ మార్కెట్టు దగ్గర కలిసే వున్నాం.
భార్య: (కోపంగా) : అక్కడే వుండండి, వస్తున్నా.
ఓ 10 నిమషాల తర్వాత....
భార్య: మార్కెట్టులో వున్నా.. మీరిద్దరు ఎక్కడ. ??
భర్త: హ హ...?? నేను ఆఫీసులో వున్నా.
సుమతి ఎవరో నాకు తెలీదు.
ఎలాగు మార్కెట్టు దాకా వచ్చావుగా, కావల్సినవన్నీ కొనుక్కొని వెళ్లు...
ఇంటిలిజెంట్ గర్ల్
అమ్మాయి: ఈసారి పరీక్షల్లో ఫెయిల్ అయితే మా నన్నా నాకు పెండ్లి చేస్తా అన్నాడు.
అబ్బాయి: అవునా.. మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావ్
అమ్మాయి: నా పనులన్నీ అయిపోయాయి... ఒక్క రిసెప్షన్‌కు షాపింగ్ చేయాలి అంతే...
ఇంటిలిజెంట్ ఉమెన్
భర్త: ఏం చేస్తున్నావ్ అక్కడీ
భార్య: చెట్లకు నీళ్లు పడుతున్నా అండి.
భర్త: వర్షం పడుతోంది కదా !
భార్య: ఫర్వాలేదు ! గొడుగు పట్టుకునే పడుతున్న..