Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమను ఎక్కడి నుంచి పొందాలి.. ఇతరుల నుంచేనా? ప్రేమంటే ఎదుటి వారు మనల్ని ఇష్టపడటం మాత్రమేనా? కానేకాదంటున్నారు మానసిక నిపుణులు. ప్రేమంటే ఇతరుల నుంచి పొందడం మాత్రమే కాదు.. మనల్ని మనం ఇష్టపడటం కూడా ప్రేమే అవుతుందంటున్నారు. తమను తాము ప్రేమించుకోలేని వారు ఇతరులను ప్రేమించలేరని నొక్కి చెబుతున్నారు. నిజమే.. ఇతరులను ప్రేమను కోరుకునే ముందు తమను తాము ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనం ఎంచుకున్న రంగంలో అభివ అద్ధి సాధించుకునేందుకు ఇది దోహదపడుతుంది. ఎంత కష్టమైన పనినైనా చేసేందుకు తోడ్పడుతుంది. తమ పోటీదారులకు దీటుగా పనిచేసే ఉత్సహం పెరుగుతుంది. శక్తీ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుంది.
తాను తక్కువ అనే భావన మనసులో ఏమాత్రం రానివ్వొద్దు. 'అందరికంటే నేనే ఎక్కువ' అనుకోవాలి. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోవద్దు. ఇతరులకన్నా తాను తక్కువేం కాదనే భావన రావద్దంటే సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. తనలో ఉన్న లోపాల్ని తనకే నచ్చకపోతే వాటిని దూరం చేసుకోవాలి. ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉండాలి. రోజూ కనీసం రెండు నిమిషాలపాటు ఏకాంతంగా ఉండాలి. అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ 'నేను బాగున్నాను' లేదా 'నేనేదైనా చేయగలను' అనుకోవాలి. తనను తాను ప్రేమించేవారు తనలోని అంతరంగిక శక్తుల్ని గుర్తించగలుగుతారని మానసిక నిపుణులు అంటున్నారు. తమను తాము ప్రేమించలేని వారు ఇతరుల నుంచి కూడా సరైన ఆదరణ పొందలేరు. తద్వారా ఆత్మనూన్యతకు గురవుతారు.