Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృదయారణ్యంలో
మల్లెతీగవై అల్లుకుంటావు,
నవ్వులపూలు విరబూస్తూ
చూపులముల్లు గుచ్చుతుంటావు!
మాటలప్రవాహమై
ఎదలో ఊపిరి నింపుతావు,
అలకలమొలకవై
మదిలో విరహాలు రేపుతావు!
నీవొక గుండెచప్పుడై
దేహమంతా పరుచుకుంటావు,
నీవొక వెలుగుల గొడుగువై
కలకాలం నీడగా తోడుంటావు!
- పుట్టి గిరిధర్,మహబూబ్ నగర్,
9491493170