Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ కౌగిట్లో ఒదిగి పోనా
రేయి మాటు పౌర్ణమిలా....!
నీ ప్రేమలో కరిగి పోనా
వెలుగుతున్న కొవ్వొత్తిలా....!
నీ కోసం జీవించనా
వేయి జన్మల నిరీక్షణలా....!
నీ కవితలో అక్షరమవనా
భావాల్ని అల్లుకునే బంధంలా....!
నీ నిదురలో కలనవనా
కంటిపాపకు జోల పాటలా....!
నన్ను నేను మరచిపోనా
నువ్వుగా మిగిలిన ఈ క్షణాన....!!
- శాంతి కృష్ణ,
హైదరాబాద్ (9502236670)