Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం కష్టాల కలబోత.. ఆనంద, విషాదాల వడబోత. అంతా సాఫీగా ఉందనుకున్నప్పుడే ఏదోటి జరిగి కంగు తినిపిస్తుంది. జీవితం అంటే అంతే.. కష్టాలు, కన్నీళ్లు, సంతోష ఘడియలు చీకటి వెలుగులు, భయ బ్రాంతులు అన్నిటి మధ్య ఊగిసలాగే నిత్య సంఘటనల సమాహారం జీవితం. మరీ ఇలాంటి వాటికెవరూ అతీతులు కాదు.. వీటిని అదిగమిస్తూనే ఆనందంగా గడపాలి. ఆనందం కోసం కష్టపడాలి. అంతిమ సంతోషం కోసం తాత్కాలిక ఆనందాలను వదులుకోవాలి. ఉన్న కొద్దిపాటి క్షణాలను ఆనందంగానే గడపాలి.
ఆనందం, సంతోషం అంటే ఏంటి.. కష్టపడ్డ తర్వాత వచ్చే తృప్తి ఆనందం. కష్టపడకుండానే, విజయాన్ని కోరుకోకుండానే ఆనందంగా ఉంటామనుకోవటం భ్రమ. మనకు దొరికిన ఈ అకాశాన్ని ఏమాత్రం వృథా చేసుకోవద్దు. ప్రతిరోజూ ఆనందంగా సాగాలి. ప్రతి క్షణం మధురంగా ఉండాలి. మనకున్న చిన్న జీవితంలో వర్తమానం గురించి ఆలోచించాలి. ఏమవుతుందో తెలియని మరో నిమిషం కోసం ఈ క్షణాన్ని వృథా చేసుకోవద్దు. గతం ఏమిటో తెలియదు.. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు... మన ముం దున్నది వర్తమానం మాత్రమే. నిన్న, నేడు, రేపు.. ఇది నిరంతర పరిభ్రమణం. వర్తమానాన్ని మన శక్తియుక్తులతో సద్వినియోగం చేసుకోవాలి. జీవించిన ప్రతి క్షణమూ ఆనందంగా సాగాలి.
ఆ ఆనందమే వేరు
మన జీవితాన్ని మనం ప్రేమించాలి. తోటివారినీ ప్రేమించాలి. ఇతరుల మనసులో స్థానం పొందాలి. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఆనందంగా గడపాలి. ప్రతికూల పరిస్థితులను చూసి భయపడొద్దు. కష్టాలను నిర్భయంగా ఎదురించాలి. సమాజంలోని ప్రతిఒక్కరి తోనూ స్నేహశీలిగా ఉండాలి. సందర్భాన్నిబట్టి మనసారా నవ్వాలి. ఇతరులను నవ్వించాలి. సామాజిక ద క్పథం కలిగి ఉండాలి. ఇతరు లకు సహాయ పడినప్పుడు వారి నుంచి వ్యక్తమయ్యే కృతజ్ఞతాభావం వల్ల కలిగే ఆనందమే వేరు. ఇది వెలకట్టలేనిది. పరోపకారిగా వ్యవహరించాలి. ఇదే ఆనంద జీవితానికి మూలం.
మాటల్లో వర్ణించలేనిది..
వృద్ధాప్యంలో కలిగే విజయాలకన్నా యుక్త వయసులో వరించేవే గొప్పవి. వాటిని చేజిక్కించుకునేందుకు నిరంతర క షి అవసరం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తడబడొద్దు. ప్రగతి పథంలో ప్రతి అడుగూ పటిష్టంగా వేయాలి. మనదైన ఆలోచన, సృజనాత్మకత, ప్రతిభతో సాధించుకునే విజయంతో కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. నిజాయితీగా మన రెక్కల కష్టంతో జీవితాన్ని మెరుగుపర్చుకునే వారే సమాజంలో గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఓ చిన్న ప్రయత్నమే జీవితాన్ని మార్చేయగలదు. బతికి ఉన్నంత కాలం ఆనందానికి కారకం కావొచ్చు. స్వయం కృషితో కలిగే ఆనందమే వేరు. ఇతరులను నొప్పించి పొందేది అసలు ఆనందమే కాదు. దీని ఆయుష్షు చాలా తక్కువ.
ఆత్మీయతతో కలిగేది..
మానవ జీవితంలో కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. ఫ్యామిలీలో విభిన్న మనస్తత్వాలు ఉండొచ్చు కానీ.. ఆత్మీయత విషయంలో తారతమ్యాలకు తావివ్వొద్దు. చిన్న పెద్దా తేడా లేకుండా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. పరస్పరంగా ప్రేమానురాగాలతో మెలగాలి. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచు కున్నప్పడే ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉం టుంది. ప్రతి విషయం లోనూ కోపతాపాలకుపోతే జీవితం నరకం గా మారుతుంది. ఈ కొలమిలోనే కాలిపోతూ ఉంటే విజయాలకు దూరం కావాల్సి వస్తుంది. అనుదినం ఆనందాలను ఆహ్వానించి నప్పుడే ఆ కుటుంబం నిత్యం వెలుగులతో కళకళలాడుతుంది.
దోస్తులతో దొరికేది..
స్నేహితులు ఒకచోట కలుసుకున్నప్పుడల్లా సరదాలు షరామా మూలే. నవ్వులూ పువ్వులు పారిపాటే. ఈ సంతోషాలకు కొదువ ఉండదు. అయితే... ఇవన్నీ సందర్భాన్నిబట్టి ఉంటాయి. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవి కొన్ని మాత్రమే. ఆ ఘడియలను మనసారా ఆస్వాదించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సందర్భాన్ని మనమే ఆహ్వానించాలి. ఎప్పుడూ హ్యాపీగా గడపాలి. కాలేజీ డేస్లాంటి మధుర క్షణాలను కోపతాపాలతో వ థా చేయొద్దు. తోటి విద్యార్థులందరితోనూ స్నేహ పూర్వకంగా మెలగాలి. ఒకరి సంతోషాల్లో మరొకరు పాలుపంచు కోవడం స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు అతడికన్నా వెయ్యిరెట్ల ఆనందం వ్యక్తపర్చడం మిత త్వ లక్షణం. ఇది లోపించిన వారు స్నేహానికి పనికిరారు.
ప్రేమతో లభించేది..
ప్రేమాయణంలో అన్ని క్షణాలూ మధురమైనవే. జీవితాంతం గుర్తిండి పోయేవే. అయితే.. ఇవి బలవంతంగా ఇచ్చిపుచ్చుకునేవి కావు. ఇవన్నీ సహజంగా వచ్చేవే. ఎప్పడూ తన గురించే తప్ప లవర్ ఆనం దాన్ని పట్టించుకోని వారు ప్రేమకు అనర్హులు. ప్రేమికుల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉండొద్దు. ఒకరంటే ఒకరు అహంభావం కలిగి ఉంటే అసలది ప్రేమే అనిపించదు. లవర్ మనసును నొప్పిం చొద్దు. మీ ప్రతిమాటా మనసును హత్తుకునేలా ఉండాలి. మీ ప్రతి ప్రవర్తనా ప్రేమతో కూడున్నదై ఉండాలి. ప్రతి క్షణం మధురాను భూతి కలగాలి. అప్పుడే పరసర్పరంగా ఆనందాన్ని పంచుకునే వాళ్లవుతారు.