Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరబూసిన పువ్వల్లే నవ్వుతోంది ఎంకి...
గుండెల్లో బావ ఎంత గురుతొచ్చాడో మళ్ళీ...!
కళ్ళన్నీ చెబుతున్నాయి కథలు కథలుగా
గుండెలోని బావ చెప్పిన గుస గుసలుగా...!
బుగ్గలపై విరిశాయి కొంటె నవ్వులు...
నిన్నటి జొన్న చేలోని తీపి గురుతులు...!
అందుకే...! నవ్వుతోంది ఎంకి
నంది వర్ధన పువ్వల్లే...నాయుడు బావ గుండెల్లో
గండు కోయిల పాటల్లే...!!
-శాంతి కృష్ణ