Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆడవాళ్లు అలంకరణ మొదలు పెడితే, ఇక అంతే సంగతులు.. గంటల కొద్దీ అద్దానికి అతుక్కుపోతారు' అన్నది పురుషులు సాధారణంగా చేసే ఫిర్యాదు. ప్రస్తుతం కాలం మారిపోయింది. ప్రతి ఒక్కరు తమ అందానికి, ఆరోగ్యానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇందులో మహిళలే కాకుండా పురుషులు కూడా తమ అందాన్ని పెంపొందించుకునేందుకు ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలాంటి వారు తమ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు చిన్ని ఉపాయాలు మీ కోసం...
- సాధారణంగా చాలా మంది మగవారి చర్మం ఆయిల్ కలిగి, జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ హోల్స్ కలిగి ఉంటాయి. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్మూ ధూళి ముఖ రంధ్రాల్లో చేరి మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మగవారి ముఖాన్నిశుభ్రపరుచుకోవడానికి కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించడం మంచిది.
- ప్రతి రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్లతో శుభ్ర పరచుకొని క్లెన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది.
- రోజుకు కనీసం మూడుసార్లైన ఫేస్ వాష్ క్రీమ్‌తో శుభ్రపర్చకోవాలి. అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి.
- డియోడరెంట్స్కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడొద్దు.
- షేవింగ్ చేసిన తర్వాత అలోవెరా వంటి ఫేస్‌వాష్ చేసుకుంటే చిన్న గాట్లు ఏర్పడ్డా ఏటువంటి మార్క్స్ లేకుండా చేస్తుంది.
- ముఖ్యంగా పురుషుల చర్మం రఫ్‌గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ -ఈ ప్రోడక్ట్స్‌ను లేదా ఆలోవేరాతో తయారైన ఫేస్‌వాష్‌లతో శుభ్రం చేసుకోవాలి.
- వ్యాజ్ లైన్‌ను తరచూ పెదవులకు రాస్తుండాలి.
అందగాడు అనిపించుకోవాలంటే...
- సమయానికి ఆహారం తీసుకోవాలి. వేళకు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- పర్సనాలిటీ కరెక్ట్ గా ఫిట్ అయ్యే డ్రెస్సింగ్ చేసుకోవాలి. సూట్ కాని డ్రెస్సులు అసహ్యంగా ఉంటాయి.
- పెదాలు పొడిబారకుండా, పగలకుండా చూసుకోవాలి. దీనికి లిప్ బామ్, లిప్ మాయిశ్చరైజర్ వాడటం మంచిది.
- స్టైలిష్ హెయిర్ అనేది స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. మీ ఫేస్‌ని బట్టి ఎలాంటి హెయిర్ స్టైల్ బావుంటుందో అలా చేయింకోండి.
- సిక్స్ ప్యాక్ ఉండాల్సిన అవసరం లేదు. ఫిట్‌గా ఉండటం వల్ల మీరు చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తారు.