Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను అఖరి బస్సు మిస్సైన
నిస్సహాయ ప్రయాణికున్ని!
దిగులు ముఖమేసుకుని
నిశ్శబ్ధంగా ''వస్తా''నంటావా
చేయి దర్పంగా ఊగినా గుండెక్కడో జారిపోతది!
కాళ్ళీడ్చ్నీకుంటూ
ఒంటరిగా ఇంటికొస్తానా
ఎవరు నవ్వినా నన్నే ఎగతాళి చేసినట్లంటది!
ఒకట్రెండు వరుస సెలవులొచ్చి
మనం కలుసుకోలేక పోతామా
మీరు'ఊరెళ్ళారనుకున్నా'నంటూ నిప్పు రాజేస్తరు!
సమయ సందర్భాలూ
మన అప్యాయతలకు అడ్డు గోడలై నిలుస్తాయా
ప్రతి ఒక్కరు సంజాయిషీ అడుగుతున్నట్లే ఉంటది!
ఒకరి సుఖం కోసం
మరొకరి దుఃఖం మోసం
ఓదార్పులన్నీ చివరకు మనకు బాధల్ని రగిల్చేవే!
కలిసి భారాన్ని మోస్తున్న నీకు తెలుసు
దూరాలను చెరిపేసుకునే యత్నమే
ఈఅక్షరాల కలవరింతలు!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261