Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకరిపై ప్రేమను తెలియజేయడానికి కొందరు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో అయితే ప్రేమలేఖలు రాసుకునేవారు. ఇప్పుడుంతా ఇంటర్నెట్, ఈమెయిల్స్ కాలమే కాబట్టి ఉత్తరాల రాసుకునే ప్రేమికులు అరుదు. అయితే ప్రేమను తెలియజేయడానికి, భావాలు వ్యక్తపరచడానికి సెల్‌ఫోన్ సందేశాలు, ఈమెయిల్స్ కన్నా నేరుగా మాట్లాడటం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. కళ్లలోకి చూస్తూ మాట్లాడటంలో ఫీల్ ఉంటుంది. అప్పుడే ఆ భావాలు ఎదుటి వారికి అర్థమయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రేమించాలంటే మాట్లాడాలి... మాటల్లోనూ ప్రేమను చూపించాలి.
కొందరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినా లనిపిస్తుంది. స్నేహంలో అయినా, ప్రేమలో అయినా, ఎలాంటి బంధంలోనైనా పునాది మాటలతోనే ఏర్పడుతుంది. ప్రేమికులు ఒకరికొకరు ఆకర్షితులవడం లో అందం పాత్ర ఎలా ఉన్నా, ముఖ్యపాత్రను పోషించేది మాత్రం ఎదుటివారి మాటలే. అందాన్ని చూసి ప్రేమలో పడేవారు ఎక్కువ శాతం వున్నప్పటికీ, ఆ ప్రేమ ఎంత కాలం నిలుస్తుందో చెప్పడం కష్టం. నిజమైన ప్రేమను అందించేవారు చాలా తక్కువగా ఉంటారు. నిజమైన ప్రేమను చేతలకంటే, మాటల్లోనే గుర్తించవచ్చు. కొన్ని ప్రేమ జంటలను చూసినప్పుడు వారిది ప్రేమ వివాహ మంటే నమ్మడం కష్టమే. కళ్ళకు కనిపించే రూపం, చెవులకు వినిపించే మాటల ముందు అర్థంలేనిదే అనిపిస్తుంది. నిజమైన ప్రేమికుల మాటలు ఆ విధంగా సాగేవే. ఒక అంశంలో నుండి మరో అంశంలోకి అలవో కగా మారిపోతూ కాలానికి అతితీతంగా కబుర్లాడుకునే జంటలను చూస్తుంటే మాటలకు ఇంత శక్తి ఉందా? అని ఆశ్చర్యం కలుగుతుంది. తొలిచూపులోనే ప్రేమించామని చెప్పుకునే వారితో పాటు, మొదట్లో 'హారు.. హలో...' అంటూ ఏర్పడిన పరిచయమే ఏ ప్రేమ జంటదైనా. ఆ తర్వాత వారు మాట్లాడుకునే మాటలతోనే ప్రేమ బల పడుతుంది. మిగిలిన అన్ని అంశాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రేమబంధం బలపడడానికి కారణం మాత్రం వారి మాటలే. మనసువిప్పి ప్రపంచాన్ని మరచి, ప్రేమికులు చెప్పుకునే మాటలు వారిని బాగా దగ్గర చేస్తాయి. ఒకరి మాటలు మరొకరిని ఎంతగానో ప్రభావితం చేసి, అవతలి వారి కోసం తమ జీవితాన్ని మార్చుకునేందుకు ఈ మాటలు తోడ్పడతాయి. నిజానికి మాటలకున్న శక్తి వేరే దేనికీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
ప్రేమ ఎలా వ్యక్తపర్చవచ్చు...
తమలోని భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసు కోవటం , నమ్మకం కలిగించేలా మాట్లాడటం, శరీర స్పర్శ ఇవ్వన్నీ ప్రేమను వ్యక్తపరచడానికి భాషలు... నిజంగా ఇష్టపడితే మనం అనుకోకుండానే ప్రేమలో పడిపోతాం. ఇలాంటప్పుడు ప్రేమ తెలియజేసే విషయంలో చాలా గందరగోళం ఉంటుంది. నచ్చిన వారికి తమ ప్రేమను తెలియజేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుం టారు. ప్రేమించిన వారికి నచ్చిన విధంగా తమను తాము మార్చుకుంటారు. ఇటువంటి ప్రయత్నాలలో కొంతమంది విజయాన్ని సాధిస్తారు. తమ ప్రేమను తెలియజేసి మనసులను గెలుచుకుంటారు. కొంతమంది తమ ప్రేమ భావాలను చెప్పుకోలేక ఇబ్బందిపడుతుం టారు. వారితో కలవడానికి కూడా ఇబ్బంది పడుతుం టారు. తమ ప్రేమ గురించి తెలియజేసేందుకు ధైర్యం చాలక వాటిని మనసులోనే దాచుకుని సతమతమవు తారు. తమలో ఉన్న భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలియక డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తారు. ఒకవేళ వారికి నచ్చితే ఫరువాలేదు, నచ్చక పోతే తీవ్ర అవమానంగా భావిస్తారు. మీరు ప్రేమిస్తున్న వారి గురించిగాని, ప్రేమ వ్యవహారం గురించిగాని ఎక్కువమందికి తెలియనివ్వ కుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంతమంది ప్రేమ వ్యవహారాలను స్నేహితుల నుంచి తెలుసుకోవడం ఇష్టపడరు. కాబట్టి ప్రేమ విషయాలలో మీ అంతట మీరుగా పూనుకోవడమే మంచిది. ప్రేమిస్తున్న వారికి మనసులోని భావాలను తెలిపే ముందు వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. వారికి నచ్చిన, సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో మనసులోని భావాలను తెలియజేయటం మంచిది. అప్పుడే వారి మనసులోని భావాలు బయటకు తెలుస్తాయి.అప్పుడు వారిని సులువుగా అర్థంచేసుకోవచ్చు.
బప్రస్తుత కాలంలో ఎక్కువమంది తమ ప్రేమ విషయాలను సెల్ఫోన్లు, ఫేస్బుక్ ద్వారా తెలియజేస్తారు. ఇలా చేయడం వల్ల ఇష్టాయిష్టాలు ఎదురుగా తెలియజేయడానికి అవకాశం ఉండదు. వీలైనంతవరకు స్వయంగా మాట్లాడాలి, లేదంటే ఉత్తరం రాయటం మంచిది. ఎందుకంటే కాగితంలో మన మనసులోని భావాలు రాయడం ద్వారా ఎదుటివారు త్వరగా ఆకర్షితులవుతారు. కాగితంలో రాసే అక్షరాలు మన మనసులో దాగిన భావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల ప్రేమ ఇంకా బలపడుతుంది.
బమీరు మీరుగానే ఉండి మీ మనసులోని భావాలను వ్యక్తపరిస్తేనే మంచిది. ఎవరైనా అటువంటి వాళ్లనే ఇష్టపడతారు. అనవసరమైన విచిత్రచేష్టలు చేయకుండా ఉండటం వలన ఎదుటివారికి మీపై మంచి అభిప్రాయం కల్గుతుంది.
ఒకవేళ మీ ప్రేమ తిరస్కరిచబడితే అవమానంగా భావించక, మీలో ఉన్న లోపాలను సరిచేసుకోవడం మంచిది. దాని వలన రాబోయే రోజుల్లో వారి అభిప్రాయం మారవచ్చు.