Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటిలాగే నిశి రాత్రిలో నువ్వు గుర్తుకొస్తావు
నువ్వు లేని ఆ ఏకాంతపు ఘడియలను దాటేస్తాను
ఆ క్షణం... ఎన్నో వేల, లక్షల ప్రశ్నలతో నా గుండె ఘోషిస్తుంది.
ఆ హృదయ ఘోషలో నీ పేరు వినబడుతుంది.
నీకు నాకు ఎంత దూరం ? పక్క పక్కనే ఉంటాం.. కానీ
మన మధ్య కొన్ని వేల కాంతిసంవత్సరాల దూరం..
మనసు లోలోపలి పొరల్లో జ్ఞాపకాలేవో గుచ్చుకుంటాయి
శిలగా మారిన ఈ హృదయాంతరాల్లో ఏదో ఘర్షణ ?!
నీ జ్ఞాపకాలను దిగమింగాక ఆకలి చచ్చిపోద్ది
నా మీద నీ ప్రేమ లాగే!
ఎన్నటికీ మానని ఓ గాయాన్ని తడుముకుంటూ నిద్రపోతాను.
ఏవో దిగుళ్లు సెగలు గక్కుతాయి
జ్ఞాపకాలు తచ్చాడుతాయి.. మేల్కొంటాను..
లేచి ఈ సిటీ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను
ఆ హైమస్ట్ లైట్లన్నీ నావైపు సానుభూతిగా చూస్తుంటాయి
ట్రాఫిక్ సిగళ్లు నా ప్రేమకు శ్రద్ధాంజలి ఘటిస్తుంటాయి.
ఆ చెట్లన్నీ నా కోసమే అన్నట్టు దిగాలు పడుతుంటాయి
వీచీ వీయని గాలికి పువ్వులు కొన్ని నేల రాలడాన్ని చూస్తాను
కొద్ది సేపటికే దూరంగా విసిరేయబడతాయి.
మరుక్షణం అవి మట్టిలో కొట్టుకుపోతాయి...
అచ్చు మన ప్రేమలాగే..
-వినోద్ మామిడాల,
07660066469