Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను- ఆమె
ఆమె వెనకాలే నడుస్తున్న
వలపుల వయ్యారి సొంపులు చూస్తూ
ఆమె పక్కనే నిల్చున్న
సొగసరి నడుము ఒంపులు కదలికకై
ఆమె ఎదురుగా వస్తున్న
మనసంతా ఉక్కిరి బిక్కిరి అవుతూ
అందచందాలను లెక్కించి
మౌన భాషితమై పరవశిస్తున్నాను
ఎక్కడ చూసినా ఆమె
ఎక్కడ నిలిచిన ఆమె
ఆమె వెనుకే నేను
నా వెనకే ఆమె
- ఉండ్రాళ్ల రాజేశం,సిద్దిపేట,
9966946084
జాడ ఆమెదే!
కలుసుకోవడం ఒక వ్యామోహం
ప్రేమకు కలయిక వైకల్పికం!
నింగి నేలను కలుసుకోదు
కురిసిన వాన చినుకులే ప్రేమ లేఖలు!
బంధాలకు దూరాలు బంధకం కావు
ఊహొక్కొటి చాలు దగ్గరవ్వడానికి!
వాన స్పర్శకు నేల విచ్చుకున్నట్లే
తిన్నారా అందా కడుపు నిండి పోతది!
చెట్టులా నుంచున్నా మట్టిలా ఆమే ఆధారం
నీడ నేనిస్తున్నా జాడ ఆమెదే!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి