Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ అంతం లేనిది. స్వార్థం లేనిది. గుడ్డిదో, చెవిటితో ఏదైతేనేం ప్రేమ మాత్రం అనిర్వచనీయం. ఇలాంటి ప్రేమ ఒక్కోసారి విఫలమవు తుంది. కారణాలేమైనా ఉండవచ్చు. కానీ ప్రేమికులు దూరమవుతారు. కొందరు ప్రేమించిన వ్యక్తికి దూరమైనా అతన్ని లేదా ఆమెను ఇష్టపడుతుంటారు. ఒక రకంగా ప్రేమను చంపుకుంటారు. కానీ మాట్లాడటానికి భయపడి మౌనంగా ఉంటారు. ఆ మౌనం వెనుక భయం ఉన్నట్టే, బాధ్యతా, భద్రతా, ఆలోచన ఉండే ఉంటాయి. మీకు దూరమైన అమ్మాయి ఎందుకు దూరమైందో, తన పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకుంటే మీరు నిజమైన ప్రేమికులవుతారు. ప్రేమించటం మొదలెట్టిన కొన్నాళ్లకు ఒక మెర్చురిటీ దశలో ఆమె ఆలోచించటం మొదలెడుతుంది. అమ్మా, నాన్న, కుటుంబం, ఆమె చదువు, భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఇలా అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది. దీంట్లో దేనికైనా ఆటంకం కలుగుతుందనిపిస్తే తన ప్రేమను త్యాగం చేసుకునే అమ్మాయిలు కొందరుంటారు. అలాంటి అమ్మాయిలు ప్రేమికునికి దూరంగా ఉన్నా ప్రేమకు దూరం కాదని చెప్పాలి. అలాంటి అమ్మాయి ప్రేమను అర్థం చేసుకుంటే తప్పా తెలిసిరాదు. ఒకవేళ మీ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఈ కేటగిరీలోకి వస్తే మీరు చేయాల్సిందల్లా అమెను అభినందించటమే తప్పా ఇబ్బంది పెట్టకూడదు. ఆమెను అలా ఉండనివ్వా ల్సిందే.. అప్పుడే మీరో మంచి ప్రేమికులవుతారు...
అలా ఉంవడనివ్వండి...
మాట్లాడటం మానేసిన మీ గర్ల్‌ఫ్రెండ్‌ను పదే పదే అడగటం కన్నా ఆమెను అలా ఉండనివ్వ టమే ఇద్దరికీ మంచిది. ఎందుకు మాట్లాడటం లేదో తెలుసుకునే ప్రయత్నం రెండు లేదా మూడు సార్లు జరగాలి కానీ అదే పనిగా ప్రయత్నించటం ఓవరాక్షనే అవుతుంది. అది తనకు విసుగు తెప్పించే పని కూడా అవుతుంది. ముందు తను ఎందుకు మాట్లాడటం మానేసిందో తెలుసుకోవాలి. అది తనను అడగేకంటే ముందే మీరే తెలుసుకోవటం బెటర్. తర్వాత మీరే అపాలైజ్ అయి క్షమాపణలు అడగొచ్చు. మీరు తప్పు చేయటమే తను మాట్లాడకపోవటానికి ఒక కారణం.. మరొకటి మీరు తప్పు చేసినా చేయక పోయినా మీతో పూర్తిగా మాట్లాడకుండా, మీతో రిలేషన్‌ని తెగదెంపులు చేసుకోవాలనుకునే కారణం కూడా ఉండచ్చు. ఇలాంటి రెండు సందర్భాల్లోనే మీ గర్ల్‌ఫ్రెండ్ మీతో మాట్లాడటానికి ఇష్ట పడదు. ఈ రెండింటో మీ గర్ల్‌ఫ్రెండ్ ఉద్దేశ్యం ఏంటో తెలుసుకోవాలి. మొదటిదే కారణమయితే కొంత ఆలస్యంగా అయినా మాట్లాడుతుందనే గ్యారెంటి ఉంటుంది. కానీ రెండోది కారణమయితే ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే మీరు బెటర్ ఛాన్స్ కాదనే ఫీలింగ్ తనకు కలిగినప్పుడు మీకు దూరమవ్వడమే మంచిదనుకుంటుంది. మీ మీద ఆసక్తి, ఇష్టం, ప్రేమ తగ్గిపోతాయి. ఎందుకంటే భవిష్యత్‌లో ఎవరైనా భద్రత కోరుకుంటారు. మీతో ఉంటే అది ఉండదు అని అనుకున్నప్పుడు కచ్చితంగా మీతో రిలేషన్‌షిప్‌ను కొనసాగించలేరు. మీరే అర్థం చేసుకుని మీకు మీరు అభివ ద్ధి చెందటమే మీరు చేయాల్సిన పని.