Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీనేజర్లు తరచూ ఒక కాంప్లెక్స్‌కు గురవుతుంటారు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు సరైన గైడెన్స్ లేనప్పుడు ఆత్మస్థయిర్యాన్ని కోల్పోతారు. అలా కాకుండా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వాళ్లకు సహకరించే విధంగా ఉండాలి. అవేంటో చూడండి.
కుటుంబ సభ్యుల పాత్ర:- కుటుంబ వాతావరణంలో కచ్చితమైన మార్పులు రావాలి. ప్రతిరోజూ కొంత సమయం పిల్లలతో గడిపే పరిస్థితులు మెరుగవ్వాలి. పిల్లల ఆలోచనలు అర్థం చేసుకుంటూ భరోసా కలిగించే విషయాలను చెప్పటం చాలా అవసరం. భవిష్యత్ లో ఎదుర్కొనే ఏ విషయం పట్లనైనా వారికిది ఆలంబనగా ఉంటుంది.
విద్యాసంస్థల పాత్ర:విద్యార్థులను మార్కుల కోసమే కాకుండా మానసిక పరిణితిని పెంచే జీవితాలనే పాఠాలుగా బోధించాలి. దీనివలన మంచి చెడుల పట్ల విచక్షణ కచ్చితంగా విద్యార్థులలో పెరుగుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు నేటి విద్యావ్యవస్థలో దీనికై కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది .
సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాగ్రత్తలు:- సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో (వాట్సాప్, ఫేస్బుక్, యూ ట్యూబ్, చాట్టింగ్స్ వగైరా) వినియోగించే ప్రతి ఒక్కరూ సంచలనాలను సృష్టించాలనుకోకుండా సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో సంయమనంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక భయాందోళనలకు, అనుమానాలకు దారితీసే ఏ విషయాల నైనా అపరిచితులో షేర్ చేయవద్దు. దీనివలన ఒక్కొక్కసారి వినోదమనేది విషాదంతో ముగుస్తుంది.
విద్యావంతుల బాధ్యత : వేగంగా మారుతున్న సామాజిక ,సాంఘీక అంశాలను హేతుబద్దంగా అర్థం ంచేసుకుని ఆత్మనూన్యతా భావాల నుండి ఆత్మవిశ్వాసాల వైపు అడుగులు వేయించాల్సిన విద్యావంతుల పైన ఎంతైనా వుంది.
'మనిషి సామాన్యుడైనా తన అసమాన ప్రతిభ, కృషి, పట్టుదలతో ఎదగగలడనేది అక్షర సత్యం. అందుకే ఆత్మనూన్యతలనే చీకట్ల నుంచి ఆత్మ విశ్వాసమనే వెలుగు రేఖలలోకి అడుగుపెట్టి మానవుడే మహనీయుడనేది నిరూపణ చేయగలగటమే మన ముందున్న తక్షణ కర్తవ్యం
- అమరనాథ్, 9849545257