Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ గాలికెలా తెలిసిందో
నేనిక్కడ ఉన్నానని
ఆమె అందెల రవళి ని
ఏం చక్కా మోసుకొచ్చింది
ఆ వెన్నెలకి చెప్పింది ఎవరో
ఆమె చలువ చూపుల్ని
నాపై సుతారంగా విసిరేయమని
ఆ సెలయేరు కెలా తెలిసింది
ఎక్కడ తీసుకుంది తర్ఫీద్
అచ్చం ఆమెలానే నడుస్తుంది
అరే ! ఆ గులాబి మొక్కేంటి
ఆమె చక్కదనాల నవ్వుల్ని
రోజు పూస్తూనే ఉంది
- గులాబీల మల్లారెడ్డి 6304545702