Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంతవరకూ మనం క్రెడిట్, డెబిట్, ఆధార్ కార్డుల రూపంలో ఉన్న పెండ్లి కార్డు చూశాం. కాస్తా ముందుకొస్తే వాట్సాప్, ఫేస్బుక్ పెండ్లి కార్డులూ చూశాం. ఎవరి ఇష్టకి ఇష్టమున్న స్టయిల్లో వారు తమ పెండ్లి కార్డును తయారు చేసుకోవటం అలవాటే. అలాంటి అభిరుచిలో భాగంగానే ఇలాంటి పెండ్లి కార్డులు తయారయ్యాయి. కానీ కేరళలోని ఓ కెమిస్ట్రీ టీచర్ పెండ్లి కార్డు చేశారను కోండి మీరు నిజంగా షాక్ అవుతారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తిరువనంతపురానికి చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్ తన వివాహా ఆహ్వన పత్రికను డిజైన్ చేయడంలో చూపిన క్రియేటివిటీ, దీనికి తోడు ఓ రాజకీయ నాయకుడు దానిమీద చమత్కారంగా స్పందించటం వల్ల అది అందరినీ ఆకట్టుకుం టోంది. తిరువనంతపురానికి చెందిన విధున్ అనే కెమిస్ట్రీ ఉపాధ్యాయురాలి పెండ్లి డిసెంబర్ 14న జరిగింది. అయితే ఆమె వృత్తిపరంగా కెమిస్ట్రీ టీచర్ కావడంతో తన పెండ్లి పత్రికను వినూత్నంగా డిజైన్ చేయించింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని బెంజీన్ ఆకారంలో ఉండే రసాయన బంధనాలను గుర్తుకు తెచ్చే విధంగా పత్రిక డిజైన్ చేయించింది. దాంతోపాటు 'లవ్' అనే ఆంగ్ల పదాలను జోడించి ఆ రెండు బందాలను కలుపుతూ, వధూవరులు పేర్లను అందులో రాసి అచ్చు వేయించింది. అలా డిజైన్ చేసిన పత్రికను ఫొటో తీసి సోషల్ మీడియా ఉంచింది. దీంతో ఆమె క్రియేటివిటిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.