Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీకూ నాకూ మధ్య
ఓ నిశ్శబ్దపు తెర...
నీలి మేఘంలా పరచుకుంది...
ఖర్చవుతున్న క్షణాలను
కన్నార్పకుండా చూస్తూ...!
ఓ క్షణమైనా అపురూపమై
తనను తాకుతుందేమోనని...!
మూగవైన మనసుల్లో
చెలరేగే సంఘర్షణలు
వెలికిరాని భావాలలో
వేల వేల వేదనలు...!
నిండుకోలేదని నిండి ఉన్నావని
చెప్పాలనే పెదవిదాటని మాటలు...!
గట్టు దాటని భావోద్వేగాలు...
గట్టు దాటిన సమయాలే...
ఆ నిశ్శబ్దపు తెర బద్దలయ్యే క్షణాలు...!!
-శాంతిక్రిష్ణ, హైదరాబాద్