Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె నదిని పువ్వుగా మలుచుకొని
జడలో తురుముకుంది తన కేశముల చివర
పచ్చనికాలువ ప్రవహిస్తున్న దృశ్యాలు..
నేను ఆ నదిపైవాలిన గోరింక అక్కడ
ఎర్రటి గోరింటలా బాగా పండిన ఎండ
తను నదిపూల రేకుల నీడను పరుస్తున్నది
నీడలలో నేనో జలపాతం..
పచ్చని కాలువను నాలో కలుపుకొని
నదిపువ్వుపై నీటిబిందువులా జారుతున్నాను..
ఇప్పుడు ఆమె సిగన
నదిపువ్వుతో పాటు నేను..
చివరకు ఆమె నదిలా..
నేనో పచ్చని కాలువలా..
ఇద్దరం ఒకరిలో ఒకరం..