Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భర్త: ఇక మీదట బండి వెనుక కూర్చొనే వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు రూల్ పెట్టారు.
భార్య: అయితే, పదండి.. మార్కెట్లోకి వెళ్లి అన్ని చీరలు, డ్రెస్ల మీదకు మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొని వద్దాం.
పెద్దమనిషి వయస్సు
రంగన్న: డాక్టర్ గారూ.. నా కుడికాలు ఒకటే నొప్పిగా ఉందండీ... నొప్పి భరించలేకపోతున్నాను.. మీరే కాపాడాలి..
డాక్టర్: పెద్ద జబ్బేమీకాదు.. వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..
రంగన్న: అది కాదు డాక్టర్.. నా రెండు కాళ్ళకూ ఒకటే వయస్సు కదా.. మరి ఎడమకాలు బాగానే ఉందిగా..
చూసి మెచ్చుకోవాలి సుమీ...
పాపారావు కుయ్యో మొర్రో అంటూ డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
డాక్టర్: ఏంటయ్య వళ్లంతా ఆ దెబ్బలు?
భర్త: భోజనం చేస్తూ... కూర చాలా బాగుందని పొగిడితే మా ఆవిడ కొట్టింది డాక్టర్.
డాక్టర్: పొగిడితే కొట్టే భార్యలు కూడా ఉన్నారా?
భర్త: కాదు, డాక్టర్.. ఆ కూర పక్కింటావిడ ఇచ్చిందట!