Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అయితే ప్రశాంతంగా ఉండాలని చాలా మంది అనుకుం టారు. కానీ వెళ్తే ప్రశాంతంగా కనబడేలా ఉండటం అనర్థమేనటా.. దీన్ని ఉత్సాహం లేని తనంగా భావించి వచ్చిన వారిని ఆ కంపెనీ ప్రతినిధులు రిజక్ట్ చేసే అవకాశం ఉందట. ఇంటర్వ్యూ కి వెళ్తే మనసంతా ఉత్సాహంగా, ఫ్రీగా, ఎక్సాయిట్ మెంట్‌తో కనబడాలనీ, అలాంటి వ్యక్తులనే పలు కంపెనీల నాయకులు ఇష్టపడుతున్నారని యూఎస్‌కు చెందిన స్టాంఫోర్డ్స్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెళ్లడైంది. అమెరికాల్లో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వర్క్ ఏరియాల్లో ఈ సర్వే నిర్వహించారు. దీంట్లో 47 శాతం మంది ఎక్సాయిట్మెంట్ పర్సన్స్‌ని ఫెవర్ చేయగా, 23.7 శాతం మంది కామ్ పర్సన్స్‌ని, 30 శాతం మంది న్యూట్రల్ పర్సన్స్‌ని ఫెవర్ చేశారు.
అయితే ఒక్కో కంపెనీ ప్రతినిధులు ఒక్కో గుణం కలిగిన ఎంప్లాయిస్ను కోరుకుంటారు. ఒకవేళ మీరు ఏదైనా జాబ్‌కి వెళ్లేప్పుడు ముందే ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి. లేకుంటే మీ ఉత్సాహం అత్యుత్సాహమే అవుతుంది.
ఇంటర్వ్యూకి వెళ్తుంటే.. !
మీరు వెళ్తున్న కంపెనీ పాలసీ, స్ట్రాటజీ వివరాలు ముందే కనుక్కోండి.
ఎలాంటి ప్రశ్నలు ఉంటాయో ముందే తెలుసుకోవటం ఉత్తమం. దీని కోసం ఆ కంపెనీలో తెలిసిన వాళ్లుంటే మాట్లా డటమో లేకా ఇంటర్నెట్లో వెతకడమో చేయాలి.
ఇంటర్వ్యూ చేసే వారిని వారి సంస్థ గురించి ప్రశ్నలు వేయొచ్చు. ఇందువల్ల ఉద్యోగంపై మీకున్న ఆసక్తిని ఇంటర్వ్యూ చేసేవారు గుర్తిస్తారు.
ఇంటర్వ్యూకి వెళ్లేటప్పడు డ్రెస్ విషయంలో కూడా జాగ్రత్తవహించాలి.
ఇంటర్వ్యూకు నిర్ణీత సమయం కంటే ముందే హాజరుకావాలి.
మొదటి ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ కలిగేలా మాట్లాడాలి.
ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. సబ్జెక్టు మీద మంచి పట్టును ప్రదర్శించాలి.
ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
చెడు అలవాట్లు, మానరిజమ్స్‌ను పోగొట్టుకోవాలి.
ఇంటర్వ్యూ అయిన తర్వాత ధన్యవాదాలు చెప్పాలి. ఈ-మెయిల్ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేయొచ్చు.