Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియతమా...నా ప్రియతమా...!
సింధూరరాగరంజితమైన
నీ పాపిట కిరువైపులా చిక్కగా,చక్కగా
నల్లగా ఒత్తుగా...వీణ మెట్లవలె ఉన్న
నొక్కు నొక్కుల జుత్తును చూస్తే చాలు...
అదృశ్యతంత్రులు వాటికవే మీటబడుతున్నట్లూ...
మలయమారుతాది రాగాలను
నేనే రహస్యంగా వింటూన్న మహానుభూతి!
సూర్యచంద్రుల గుణగణాల కలగలుపైన
నీ కన్నుల ప్రసన్నవీక్షణ మొక్కటి చాలు...
నా మనోవ్యథలన్నింటినీ హరించివేసి
నన్ను నవోత్సాహుడుగా నిలబెడ్తుంది!
ఇరుసంజెల కెంజాయల రాగాలను
పుక్కిట పట్టుకున్న నీ నిగ్గుల బుగ్గలు
రోజామొగ్గలను పూయిస్తూంటే...
నీ నోట పలికిన మాట ఒక్కటే చాలు-
అది నాకు అమృతగీతవర్షమే సుమా!!!
-రఘువర్మ, జగిత్యాల,
సెల్:9290093933.