Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగిల్‌గా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి మింగిల్ అయితే.. తీరు మారుద్ది. భాష మారుద్ది. మనిషే మారతాడు. వాళ్లు ఎప్పుడెలా ఉంటారో చెప్పలేం. ఏదో మైకం వారిని కమ్మేస్తుంది. ఎప్పుడూ ప్రేమించిన వ్యక్తి ఆలోచనే. తిండి, నిద్ర ఎరుగరు. ఊహల ప్రపంచంలో విహరిస్తారు. అయితే... ఇదంతా వీరు తమంటత తాము ఉద్దేశపూర్వకంగా చేసేవి కావంటా.. బాడీలో ఎదో కెమిస్త్రీ జరిగి ఇలా ప్రవర్తిస్తారంటా...
ప్రేమలో పడినప్పుడు మెదడులోని కొన్ని భాగాలు వివిధ రకాల రసాయనాలను ఎక్కువుగా ఉత్పత్తి చేస్తాయని, వాటి ఫలితంగానే వీరి ప్రవర్తన ఇలా వింతగా ఉంటుందని చెబుతున్నారు.
డొపమైన్ అనే రసాయన చర్య వల్ల అంతులేని ఆనందం కలుగుతుందట. ప్రేమికులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ఇదే కారణమట. అందుకే.. తిండి సరిగా తినకపోయినా, నిద్ర పోకపోయినా ప్రేమికులకు ఏమాత్రం నీరసం ఆవరించదు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
అలాగే ప్రేమికులు ఆందోళనగా ఉండటానికి డ్రిలిన్ అనే రసాయనం కారణమట. ఇది ఎక్కువగా విడుదల కావటం వల్ల ఒళ్లంతా చెమటలు పడతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నోరు తడారిపోతుంది. ప్రేమికుల ఆలోచనలెప్పుడూ తన ప్రియురాలు, ప్రేమికుడి చుట్టూ తిరగడానికి సెరెటోనిన్ రసాయనం కారణమట. దీని చర్య వల్ల ఆలోచనలన్నీ ఒకేదానిపైనే నిలిచిపోతాయి. అందుకే ప్రేమికులు చుట్టు పక్కల వారిని, తమ పరిసరాలను ఏమాత్రం పట్టించుకోరు. తమ ప్రేమ గురించే ఆలోచిస్తూ ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు.