Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ, ఆప్యాయతల కరువుతో
మోడువారిన నా జీవితంలోకి
మళ్లీ నువ్వొస్తావని,
అనురాగాల మల్లెలు పూచే
వసంత మాసాన్ని మోసుకొస్తావని,
వసివాడిన పాత ఆశల
పొత్తిళ్లనుండి క్రొంగొత్త ఆశయాలు
మోసులెత్తుతాయని,
నా జీవన వనంలో
వాడిపోయిన నవ్వుల పూలు
మళ్లీ వికసిస్తాయని
నేననుకోలేదు నేస్తం!!