Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెంతకురా
చిలిపి పనుల చేష్టలకు దరహాసం నువ్వైనపుడల్లా
వసంతపు చిగురునై పులకిస్తుంటా నేను
చందమామలా నువ్వు నవ్వినప్పుడల్లా
యవ్వనవన్నెకు వెన్నలనద్దిన వేకువై
ప్రకాచిస్తాను నేను
నా ఊహాల మట్టిపై నువ్వు అంకురమైనపుడల్లా
నిన్ను కంటికిరెప్పలా చూసుకునే
మమతానురాగలను నిండిన రైతునవుతాను నేను
నాలో ప్రేమలా మారిన మౌనం నీవే
నీ మౌనానికి శూన్యమై ఏదురుచూస్తున్నది నేనే
ఇకనైనా అల్లరికి ఆనందం పరిచయం చేద్దాం చెంతకురా
ప్రియతమా
-అభిరామ్ 7981463065
నిరీక్షణ
తీరం చేరని నిరీక్షణ
ఆమె నిన్నటి లాగే వచ్చింది మెట్రో స్టేషన్కి
కళ్ళు కళ్ళు కలిశాయి ఏదో ఫ్లాష్ ..
చూపులు మెరిశాయి కిరణాల్లా
మనస్సు ఎక్కడికో ఎగిరిపోయింది పావురమై
హృదయం కనెక్ట్ అయ్యింది పాతపాటలతో
నిన్న లేని అందమేదో నిదురలేచే నంటూ
మెట్రో రైలెక్కింది ఆమె
ఎల్లోరా కదిలినట్టు
అజంతా ఆడుగులేచి నట్టు
కవి భవభూతి లా
నాలో ఏదో అనుభూతి
ఆమె ఎదురు సీట్లో కూర్చున్నాను నేను
అటు ఆమె కదలికదలని హొయలు
ఇటు నా గుండెల్లో సరాగాల లయలు
రోజు ముప్పై నిమిషాలు మూడు సెకండ్లలా
కరిగిపోతుంది కాలం ఎన్నాళ్ళో తీరం చేరని నిరీక్షణ
-గులాబీల మల్లారెడ్డి, 6304545702