Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీరెవరిని అయినా ప్రేమించారా? మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బారు ఫ్రెండ్ తరచూ అలుగుతున్నారా? లేక పలకరించకుండా ఉంటున్నారా? అయితే వాళ్లను పలకరించడానికి విష్ చేయడమే మంచి మార్గమట... కొన్ని సందర్భాల్లో లవర్స్ మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. అలాంటప్పుడు విడిపోయిన ప్రేమికులు సహజంగా కొద్దిరోజులపాటు ఒకరినొకరు పలకరించుకోకుండా ఉంటారు. మనస్తాపానికి గురై ఒంటరిగా కొన్ని కాలాలు గడుపుతారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలు అంత తొందరగా అలక వీడరు. అలాంటప్పుడు ప్రేయసిని పలకరించేందుకు చక్కటి మార్గం ఒక్కటే. ఆమెను ఏదైనా స్పెషల్ డే సందర్భంగా విషేస్ చెప్పేయడమే...
ప్రియురాలిని కలుసుకోవాలంటే అది మీరు ప్రవర్తించే వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుంది. తనకు నచ్చిన విషయాలను సేకరించి, తనను ఆనందపరిచే హావభావాలను ముందుగానే ప్లాన్ చేసి ఉంచుకోవాలి. ఎటువంటి తొందరపాటు పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తనకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి. అందులో అతి సులభమైన పద్ధతి ఆమెకు ఫోన్ కాల్ చేయడం.
సాధారణంగా అమ్మాయిలు తన పుట్టినరోజు జరుపుకున్నప్పుడు గానీ, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు గానీ, న్యూ ఇయర్ సందర్భంగా గానీ విష్ చేస్తే వారు చాలా సంతోషిస్తారు. అటువంటి సమయాల్లో అమ్మాయి తన మాజీ ప్రియుడి నైనా సరే... ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ప్రేమగా పలకరిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో వారిని ఫోన్ ద్వారాగానీ, నేరుగా కలిసి విష్ చేయడం ద్వారా ఆమెకు మీ మీద అభిమానం పెరుగుతుంది.