- ఆమెనలా చూస్తున్నకొద్దీ కొత్తదనం ఉట్టిపడుతూనే వుంది ఏళ్ళు గడుస్తున్నా తరగని తన్మయత్వం మనసులో భావుకత రెట్టింపు ఆస్వాదించే మనసులో పొరపొచ్చాలు లేనేలేవు చూసే కోణం గడపాలనుకుని కాదు జీవించే దృశ్యంలో శ్రవణం కన్నా వీక్షణమే స్పందనల మేలుకొలుపు మాటల వైరుధ్యాలు స్పర్శ తో దూరం దగ్గరయ్యే మనసులు తుళ్లింతలో మేను తిండీతిప్పలు ఆలింగనంలో ఆమడ దూరం గాఢ పరిష్వంగంతో మనసునావరించిన గాఢాంధకారం సైతం తరిమేత జీవనంలో ఆమె నా విల్లు అమ్ములపొదిలో ఎన్ని బాణాలున్నా ఆమె లేకపోతే పునాదిలేని భవనాన్ని నేను తరగని ఆస్తి ఆమె భావమామె చుట్టూ అల్లుకున్న తిప్పతీగ తెంపలేనిది తెంపినా చిగురు తొడుగుతునే ఉంటదంతే - గిరిప్రసాద్ చెలమల్లు 9493388201 |
జోష్
| www.NavaTelangana.com
- ఆమెనలా చూస్తున్నకొద్దీ కొత్తదనం ఉట్టిపడుతూనే వుంది ఏళ్ళు గడుస్తున్నా తరగని తన్మయత్వం మనసులో భావుకత రెట్టింపు ఆస్వాదించే మనసులో పొరపొచ్చాలు లేనేలేవు చూసే కోణం గడపాలనుకుని కాదు జీవించే దృశ్యంలో శ్రవణం కన్నా వీక్షణమే స్పందనల మేలుకొలుపు మాటల వైరుధ్యాలు స్పర్శ తో దూరం దగ్గరయ్యే మనసులు తుళ్లింతలో మేను తిండీతిప్పలు ఆలింగనంలో ఆమడ దూరం గాఢ పరిష్వంగంతో మనసునావరించిన గాఢాంధకారం సైతం తరిమేత జీవనంలో ఆమె నా విల్లు అమ్ములపొదిలో ఎన్ని బాణాలున్నా ఆమె లేకపోతే పునాదిలేని భవనాన్ని నేను తరగని ఆస్తి ఆమె భావమామె చుట్టూ అల్లుకున్న తిప్పతీగ తెంపలేనిది తెంపినా చిగురు తొడుగుతునే ఉంటదంతే - గిరిప్రసాద్ చెలమల్లు 9493388201