Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి: సైన్సు ఫెయిరు రోజు
చదువుల పండుగ రోజు
విజ్ఞానాలు పూచే నేటి రోజు ..అ..
సైన్సు ఫెయిరు రోజు
చదువుల పండుగ రోజు
విజ్ఞానాలు పూచే నేటి రోజు ..అ..
చరణం: బుర్రలోని ఆలోచనలు
ప్రయోగాలుగా చేసిన రోజు
ప్రయోగాలైన ఆ ఆలోచనలే
నమూనాలుగా పెట్టిన రోజు
విశ్వంలోని జ్ఞానమంతా
అరచేతిలోకి వచ్చిన రోజు
సైన్సు ఫెయిరు రోజు
చదువుల పండుగ రోజు
విజ్ఞానాలు పూచే నేటి రోజు ..అ..
చరణం: ఆవిష్కరణలు తెచ్చిన రోజు
మేధస్సు వికసించిన రోజు
బాల మేధావులు పుట్టిన రోజు
గురువులు గర్వించిన రోజు
బడిలోని పాఠాలన్ని
శాస్త్రీయ ఫలాలై పండిన రోజు
సైన్సు ఫెయిరు రోజు
చదువుల పండుగ రోజు
విజ్ఞానాలు పూచే నేటి రోజు..అ..