Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాదుకు చార్మినార్ ఎంత ఫేమస్సో హైదరాబాదీలకు ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. ఫ్రెండ్స్‌తో సరదాగా కబుర్లు చెప్పుకోవాలన్నా, కవితలు, కథల గురించి మాట్లాడుకోవాలన్నా ఇరానీ కేఫ్‌లే అడ్డాలు. రచయితలు ఏమైనా రాయాలన్నా.. ఓ మంచి ఆలోచన రావాలన్నా ఓ ఇరానీ చాయ్ పడాల్సిందే. ఎన్నో కథల్లో, కవితల్లో ఇరానీ కేఫ్‌లు దర్శనమిస్తాయి.
జాబులు చేసెటోళ్లు పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వాలంటే కచ్చితంగా ఇరానీ చాయ్ పడాల్సిందే అంటారు. అందుకే ఎన్నో కంపెనీలు ఉద్యోగులకు ఇరానీ చాయ్ రెండు పూటలా ఇప్పించడం హైదరాబాద్‌లో చాలా కామన్. ఇక ఇరానీ చాయ్ తో పాటు రెండు బిస్కెట్లు ఉంటే ఆ మజానే వేరు. హైదరాబాదీల జిందగీల్లో మమేకమైన ఇరానీ చాయ్ ఇప్పుడు ప్రపంచమంతా ఫేమస్. అందుకే ఎక్కడ ఎన్ని సార్లు తాగినా ఇరానీ కేఫ్‌లో ఓ చాయ్ తాగాలని ఉబలాటపడతారు. ప్రయాణికులు సికింద్రాబాదులోనో ఎంజీబోఎస్లోనో బస్ దిగగానే ముందు ఇరానీ చాయ్ ఎక్కడుందా అని వెతకడం సాధారణం.
ఇప్పుడు మామూలు చాయ్ వచ్చి ఇరానీ చాయ్ అడ్డాలు చాలా తగ్గినా ఈ చాయ్ ప్రాముఖ్యం మాత్రం పోలేదు ఇప్పటికీ అక్కడక్కడ ఇరానీ చాయ్ కేఫ్‌లు ఉన్నాయి. వెతకండి.. ఓ సారి రుచి చూడండి. పాతబస్తీలో అయితే ఇప్పటికీ ఇరానీ చాయ్ కనిపిస్తుంది. ఈ చాయ్ తాగుతూ... చార్మినార్ సొబగులు చూస్తూ... హైదరాబాద్‌ను ఎంజాయ్ చేయండి.
ఇరానీ కేఫ్‌లో ఒక్క చాయ్ తాగండి.. ఆ రుచి ఎట్లా ఉంటుందో ఆస్వాదించండి. నెక్స్ట్ టైం కచ్చితంగా చాయి కోసమే మీరు ఇరానీ కేఫ్‌ను వెతుక్కుంటూ వెళతారు.
- ఎన్.కె