Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనుల కొలనులో
కలల తామరలు
వేడి నిట్టూర్పుల పరిమళ శ్వాసలో
వెన్నెల స్పర్శల తన్మయోపశమనం
మలయమారుత యవనాశ్వం
తీగల మేనిపై దౌడుతీస్తున్న ప్రియరాగమై
ఊహల మధువు పొదువుకున్న
సోయగాల ఆశలు విరిసిన
పుడమి పూల జల్లై మురియగ
మెరుపులీనే తళుకు పెదవులపై
మధుర భావాల మరుల ఝరులతో
రేతిరి పరదాలో రాజుకున్న అలజడి
దిక్కుల గదిలో మేలుకున్న
తీయని జ్ఞాపకమై
పక్కున నవ్విన ఉదయపు అలికిడికి
రెప్పల రెక్కలు రివ్వున చాచి
విడిచిపోయింది తలపుల గాయం!
- డేగల అనితాసూరి,
హైదరాబాద్, 9247500819.